Skip to main content
Latest News

RDX లవ్.. టీజర్‌లో రొమాన్స్ చూపించారు.. ట్రైలర్‌లో ఏకంగా..

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో యూత్‌ను ఆకట్టుకొంటున్న సినిమా RDX లవ్. ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ హ్యాపీ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమాకు శంకర్ భాను దర్శకత్వం వహించారు. RX 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, యువ హీరో తేజస్ కంచెర్ల జంటగా నటించారు. ఈ నెలలోనే సినిమా విడుదల కాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన పాయల్, తేజస్ రొమాంటిక్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకొన్నాయి. శృంగారం మితిమీరిందనే మాట వినిపించినా యూత్‌ను హుషారెత్తించాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో కూడా ఫుల్లు రొమాంటిక్ సీన్స్ ఉంటాయని అంతా భావించారు. కానీ అసలు సినిమా కథేంటో చెప్పేలా ఈ ట్రైలర్ ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది.. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు కథబలం ఉన్న సినిమా అని ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. 

RDX లవ్ సినిమా రొమాంటిక్ ప్రేమకథగా ముందుగా అనుకొన్నప్పటికీ.. ఓ గ్రామానికి సంబంధించిన ఎమోషనల్ స్టోరి అనేది స్పష్టంగా అర్థమైంది. కాకపోతే గ్రామంలోని సమస్యపై హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చేసే పోరాటం నేపథ్యంగా తెరకెక్కినట్టు స్పష్టమైంది. ఈ కథలో రొమాన్స్‌ను ప్రధానాంశంగా చేసుకొని కథను అల్లుకొన్నట్టు ట్రైలర్ చెప్పకనే చెప్పింది. ‘వేటాడాలనుకొన్న మగాడికి ఆడపిల్ల లేడిపిల్లలా కనిపిస్తుంది. అదే వేటాడాలని అనుకొన్న ఆడపిల్లకు మగ సింహం కూడా కుక్క పిల్లలా కనిపిస్తుంది', ‘క్యారెక్టర్ ఉన్న ఆడపిల్ల మాటనే అగ్రిమెంట్', ‘అమ్మాయిలతో మాట్లాడాలంటే నిజం చెప్పి బతిమిలాడండి.. కరిగిపోతారు. అబద్ధం చెప్పి పాతి పెట్టకండి. కరిగించేస్తారు' అని పాయల్ చెప్పిన డైలాగ్స్ RDX లవ్ ట్రైలర్‌లో ఆకట్టుకొన్నాయి.  ప్రస్తుతం ఈ సినిమాతో పాటు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటస్తున్న ‘వెంకీ మామ’ సినిమాలో కూడా నటిస్తుంది పాయల్. మరోవైపు రవితేజ హీరోగా నటిస్తోన్న ‘డిస్కోరాజా’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News