Skip to main content
Latest News

పెళ్లయి రెండేళ్లవుతోంది.. పిల్లల గురించి మొదటిసారి నాగచైతన్య రెస్పాన్స్

తెలుగు ఇండస్ట్రీలో క్యూట్, స్వీట్ కపుల్.. ఎవరంటే.. ఠక్కున గుర్తొచ్చే జంట.. మన నాగచైతన్య, సమంతదే.. ఏమాయ చేశావో సినిమాతో నాగచైతన్యను మాయ చేసిన సమంత.. సుదీర్ఘ ప్రేమబంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకుంది. రెండేళ్ల క్రితం.. అంటే సరిగ్గా 2017వ సంవత్సరం అక్టోబర్ 7న వారిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సాధారణంగా.. పెళ్లయిన కొన్నాళ్లకే.. ఏమైనా విశేషమా..? అని అడుగుతుంటారు.. అందరిలాగానే.. ఈ చూడచక్కని జంటకు కూడా అవే ప్రశ్నలు ఎన్నోసార్లు ఎదురయ్యాయి. చాలా సార్లు నవ్వి ఊరుకుందా జంట.. సమంత మాత్రం ఓ సారి రెస్పాన్స్ ఇచ్చింది. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మొదటిసారి పిల్లల ప్లానింగ్ గురించి పెదవి విప్పాడు. ‘త్వరలోనే పిల్లల గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం నా జీవితం చాలా బ్యూటీఫుల్‌గా ఉంది. దేవుడు నాకు ఇచ్చినవాటితో తృప్తిగా ఉంది. ఇంతకుమించి ఇంకేమీ అడగలేను’ అన్నారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా సమంతకు పిల్లల గురించి ప్రశ్న ఎదురైంది. దానికి సమంత మాట్లాడుతూ.. ‘నాకు బిడ్డ పుట్టాక తనే నా ప్రపంచం అవుతుంది. పని చేస్తూ కుటుంబాలను పోషిస్తున్న తల్లులపై నాకు అపారమైన గౌరవం ఉంది. నా బాల్యం అంత హాయిగా గడవలేదు. చిన్నతనంలో నాలాంటి జీవితం గడిపిన వాళ్లు పిల్లల గురించి మాట్లాడుతూ.. తాము కోరుకున్న జీవితాన్ని అనుభవించలేకపోయారని పిల్లలకైనా బంగారు భవిష్యత్తును ఇవ్వాలనుకుంటారు. నాది కూడా అదే ఆలోచన. కాబట్టి నాకు బిడ్డ పుట్టిన కొన్నేళ్ల తర్వాత తనే నా లోకం అవుతుంది. ఆ సమయంలో ఇంకెలాంటి పనులు పెట్టుకోను. తనే నా సర్వస్వం అవుతుంది. పిల్లల విషయంలో నేను, చైతూ ఒక తేదీ అనుకున్నాం. అది మీకు చెప్పను. ఎందుకంటే అనుకున్న తేదీకి మాకు పిల్లల పుట్టకపోతే మీరంతా చైతూని అనుమానిస్తారు’ అని వెల్లడించారు.

ఇటీవల సమంత, చైతన్య కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం యూరప్ వెళ్లారు. ఓ రెండు వారాల పాటు హాయిగా అక్కడే ఎంజాయ్ చేశారు. ఇటీవల హైదరాబాద్ వచ్చారు. వచ్చీ రాగానే చైతూ తన తర్వాతి సినిమా చిత్రీకరణను మొదలుపెట్టేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. మరో పక్క సమంత ‘96’ సినిమా రీమేక్‌తో బిజీగా ఉంది. ఇందులో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్నారు. మరి ఈ సినిమాల తర్వాతయినా.. వారి ఫ్యామిలీ ప్లానింగ్ మొదలు పెడతారేమో.. వేచిచూడాలి. 

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News