Skip to main content
Latest News

సైరా సెట్‌లో జరిగిన అద్భుతమిదీ.. మేకింగ్ వీడియో రిలీజ్

చిరంజీవి అభిమానులు సైరా కోసం ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. రెండేళ్లుగా ఈ చిత్రం సెట్స్‌పైనే ఉంది. క్వాలిటీ పేరుతో సురేందర్ రెడ్డి కూడా సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. చివరికి చిరు చేతిలో అప్పుడప్పుడూ కాస్త చివాట్లు కూడా తిన్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఏదేమైనా చివరికి చిరు మెప్పు పొందాడు సురేందర్ రెడ్డి. ఈయన తెరకెక్కించిన సన్నివేశాలు కొన్ని చిరుకు బాగా నచ్చేసాయి. సైరా ఔట్ పుట్ చూసి ఫిదా అయిపోతున్నాడు మెగాస్టార్. సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. 

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో బుధవారం తేదీ మధ్యాహ్నం 3.45 నిమిషాలకు సైరా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కి సంబంధించిన స్టార్స్ సైరా చిత్రంలో కనువిందు చేస్తున్నారు. చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, తమన్నా, రవికిషణ్ నిహారిక తదితర పాత్రల్ని ఈ మేకింగ్ వీడియోలో రివీల్ చేశారు. హై టెక్నాలజీ వాల్యూస్‌తో, ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతో అద్భుత దృశ్య కావ్యంగా ఈ చిత్రాన్ని మలిచారు. సైరా చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈచిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News