Skip to main content
Latest News

నాదీ బ్రాహ్మణ కులమేనంటూ లావణ్య త్రిపాఠి వివాదాస్పద ట్వీట్.. అంతలోనే డిలీట్

అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో ఈపాటికి సినీ నటి లావణ్య త్రిపాఠికి తెలిసొచ్చి ఉంటుంది. తన సినిమాలేదో తాను చూసుకోక అనవసరంగా రాజకీయాల్లో వేలు పెట్టాలనుకున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశిస్తూ వివాదాస్పద ట్వీట్ చేసి నాలుక్కర్చుకున్నారు. వివరాల్లోకెళితే.. శనివారం రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో అఖిల బ్రాహ్మణ్ మహా సభను ఏర్పాటుచేశారు. ఈ సభకు ఓం బిర్లా వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉంది. బ్రాహ్మణుల త్యాగం వల్లే ఈరోజు ఈ సభ ఏర్పాటైంది. అందుకే బ్రాహ్మణ సంఘం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది’ అని పేర్కొన్నారు. 

ఈ ట్వీట్‌పై లావణ్య స్పందిస్తూ.. ‘బ్రహ్మణ కులానికి చెందిన వ్యక్తిగా కొన్ని విషయాలు నాకు అర్థం కావు. కులాన్ని బట్టే ఆధిక్యత ఉంటుందనే ఆలోచన నాకు అసలే బోధపడదు. ఓ వ్యక్తి చేష్టలు, పనులు వల్ల అధికుడా? ఆధిపత్యం తక్కువ ఉందా అనేది తెలుస్తుంది. అంతేకాని కులాన్ని బట్టి అధికులమనే హోదాను నిర్ధారించడం తప్పు’ అని ట్వీట్ చేశారు. అయితే ఏమనుకున్నారో ఏమో... కానీ కొద్ది సేపటికే దాన్ని డిలీట్ చేశారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ట్వీట్‌ను ఆమె మెచ్యురిటికి సాక్ష్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కానీ ఆమె చేసిన ట్వీట్ పలు రకాలుగా వివాదం అవుతున్న నేపథ్యంలో దానిని తొలగించడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. లావణ్య ట్వీట్ డిలీట్ చేయడానికి కారణమేమిటో అంతు పట్టడం లేదు. ఎవరైనా ఆమెను ఎవరైనా డీలీట్ చేసే విధంగా ప్రభావం చేశారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది.

కులమతాల గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. వాటి గురించి అందరూ మాట్లాడతారు. కానీ సెలబ్రిటీలు మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అది వారి కెరీర్‌పై ప్రభావం చూపుతుంది. అసలే లావణ్యకు కెరీర్ అంత సజావుగా సాగడంలేదు. ఆమె చేతిలో పెద్దగా హిట్ అయిన సినిమాలూ లేవు. నిఖిల్‌కు జోడీగా నటిస్తున్న ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదలకు నోచుకోలేకపోతోంది. దాదాపు ఏడాదిగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఎప్పుడు సినిమా విడుదల చేద్దామన్నా ఏవో ఒక అవాంతరాలు వస్తున్నాయి.

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News