Skip to main content
Latest News

తిరుపతిలో పెళ్లి చేసుకుంటా.. నాకు కాబోయే భర్త ఎలా ఉంటాడంటే..

దివంగత నటి శ్రీదేవి కూతురిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ.. జాన్వీ కపూర్. తొలి సినిమా ధడక్‌తోనే మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం కార్గిల్ గాళ్‌‌, రూహీ అఫ్జా, తఖ్త్‌‌, దోస్తానా 2 అంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. శ్రీదేవి, బోనీ కపూర్‌ల కూతురు అన్న ముద్రను ఇప్పుడిప్పుడే తొలగించుకొని.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా తన తల్లి శ్రీదేవితో ప్రేమానుబంధాన్ని గుర్తు చేసుకుంది జాన్వీ. తాను అమ్మతో అబ్బాయిల గురించి చర్చించేదాన్నని, పెళ్లి గురించి మాట్లాడేదానని చెప్పుకొచ్చింది. అయితే, తన నిర్ణయాలను అమ్మ ఎప్పుడూ నమ్మేది కాదని, ముఖ్యంగా పురుషుల విషయంలో అస్సలు నమ్మదని వెల్లడించింది. అందుకు కారణం.. తాను ప్రేమలో త్వరగా పడతాననేనని వివరించింది. మంచి భర్తను వెతికి పెడతానని తన తల్లి చెబుతూ ఉండేదని జ్ఞాపకాలను నెమరు వేసుకుంది.

ఇక, తనకు కాబోయే భర్త తెలివైన వాడై ఉండాలని, తానేం చేస్తున్నాడో దానిపై ఫ్యాషన్ ఉండాలని, ముఖ్యంగా అతడి నుంచి తాను నేర్చుకునేలా ఉండాలని చెప్పింది జాన్వీ. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నింటి కంటే ముఖ్యమని చెప్పింది. ఇదిలా ఉండగా పెళ్లిలో కాంజీవరం చీర ధరిస్తానని పేర్కొంది. కాగా, తన పెళ్లి ఎక్కడ జరుగుంది అనే దానికి జాన్వీ అదిరిపోయే సమాధానం చెప్పింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, తిరుపతిలో శ్రీవెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకుంటానని చెప్పింది.  సౌత్ ఇండియన్ ఫేమస్ వంటకాలతో అతిధులకు ఆహ్వానం పలుకుతానని, తనకు నచ్చిన సాంబార్, ఇడ్లి ఇందులో తప్పకుండా ఇంటాయని చెప్పింది జాన్వీ. తాజా సమాచారం ప్రకారం జాన్వీ త్వరలోనే సౌత్‌లో హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది. 

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News