Skip to main content
Latest News

ఫస్ట్ టైమ్ నేను ఓ మగాడికి జంటగా నటించా.. వరలక్ష్మిపై హీరో షాకింగ్ కామెంట్స్

తన మనసులోని మాటను నిర్భయంగా, నిర్మోహమాటంగా కుండబద్ధలుకొట్టినట్లు చెప్పడం తమిళ నటి వరలక్ష్మి నైజం. సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారన్న అంశం నిత్యం మీడియా నోళ్లలో నానుతూనే ఉంటుంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ వరలక్ష్మి తమిళ హీరో విశాల్‌ను పెళ్లి చేసుకుంటారంటూ అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. అవి వట్టి పుకార్లేనని ఆ తర్వాత తేలిపోయింది. అయితే తన ప్రేమ, పెళ్లికి సంబంధించి మీడియాలో నిత్యం వస్తున్న కథనాలను వరలక్ష్మి ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నారు.

వరలక్ష్మి శరత్‌కుమార్‌, తమిళ నటుడు విమల్‌ జంటగా నటించిన చిత్రం ‘కాన్ని రాశి’. ముత్తుకుమారన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా వరలక్ష్మి తన పెళ్లి గురించి ప్రస్తావించారు. ‘నేనే ప్రేమ వివాహం చేసుకుంటానా?పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానా? అన్న విషయం పక్కన పెడితే నాకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు’ అన్నారు. కాగా ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న విమల్.. వరలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేను తొలిసారి ఓ మగాడికి జోడీగా నటించాను’ అనేశారు. ఆ తర్వాత తనని తాను సమర్ధించుకుంటూ.. ‘అంటే నా ఉద్దేశం అది కాదు. ఆమెతో కలిసి పనిచేయడంలో నేను ఎలాంటి ఇబ్బందికి గురికాలేదు. ఆమె పాత్ర చాలా సహజంగా ఉంటుంది. కెమెరా ఆన్‌ అవగానే తన పాత్రలో లీనమైపోతారు’ అని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో వరలక్ష్మి నటుడు విశాల్ తో కొనేళ్లు పాటు ప్రేమ వ్యవహారం నడిపింది. కానీ వీరు కొన్ని కారణాలు వల్ల విడిపోయి ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. విశాల్ మాత్రం త్వరలోనే హైదరాబాద్‌కి చెందిన ఓ అమ్మాయి పెళ్లి చేసుకోనున్నాడు.

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News