Skip to main content
Latest News

వెరైటీ సినిమాల డైరెక్టర్.. కొత్త నటులతో రవిబాబు ‘ఆవిరి’

నచ్చావులే అంటూ రామోజీ క్యాంప్ నుంచి చిన్న సినిమాలకు శ్రీకారం చుట్టి, సురేష్ బాబు క్యాంప్‌లోకి వచ్చారు డైరక్టర్ కమ్ నటుడు రవిబాబు. అవును సూపర్ హిట్ అవ్వడంతో అవును-2 కూడా తీశారు. అయితే అవును 2, అదిగో లాంటి ఫ్లాపులు వచ్చిన తరువాత రవిబాబు డైరక్షన్ కెరీర్ వెనుక బడింది. ఇప్పుడు మరో చిన్న సినిమా చేసారు. ఏమాత్రం హడావిడీ లేకుండా.. అసలు పత్రికా ప్రకటన కూడా విడుదల చేయకుండా పూర్తిగా కొత్తవాళ్లతో చేసిన ఆ సినిమా టైటిల్ ‘ఆవిరి’. దీన్ని విడుదల చేసేందుకు రవిబాబు నానా తంటాలు పడుతున్నాడట. పెద్ద హీరోలు లేకపోవడం.. గతంలో తన ట్రాక్ రికార్డు కూడా ఏమంత బాగోకపోవడంతో బయ్యర్లు ముందుకు రావడం లేదంట.. 

లేటెస్ట్ సంగతి ఏమిటంటే, ఈ సినిమాను దిల్‌ రాజు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు సురేష్ బాబుతో ప్రయాణించిన రవిబాబు ఒక్కసారిగా దిల్ రాజు వైపు రావడం కాస్త ఆశ్చర్యమే. వాస్తవానికి సురేష్ బాబు కూడా చిన్న సినిమాలు ఏవి వచ్చినా, బ్యానర్ యాడ్ చేసి, విడుదల చేయించి, అడ్వాన్స్‌లు ఇచ్చి సహకరిస్తున్నారు. కానీ మరి రవిబాబు ఆ క్యాంపస్ వదిలి దిల్ రాజు క్యాంపస్‌లోకి రావడం వెనుక ఏమై వుంటుందో? ఒకటి రెండు రోజుల్లో రవిబాబు సినిమా దిల్ రాజు విడుదల చేయబోతున్నారనే అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ ఆవిరి సినిమా కూడా ఆత్మలకు సంబంధించినదేనని పోస్టర్ చూస్తే ఇట్టే అర్థం అవుతోంది.. మరి అవును సినిమాల.. ఆవిరి కూడా రవిబాబుకు హిట్‌ని ఇస్తుందో లేదో.. వేచిచూడాలి..

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News