Skip to main content
Latest News

డియర్ కామ్రెడ్.. ట్రైలర్ రిలీజ్.. లిప్‌లాక్‌లతో కుమ్మేశాడు

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం వచ్చేసింది. ‘డియర్ కామ్రేడ్’ థియేట్రికల్ ట్రైలర్‌తో ఫ్యాన్స్ ముందుకు వచ్చేశాడు. ఇప్పటికే టీజర్, పాటలతో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ‘కామ్రేడ్’.. ఈ ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేశాడు. ఈనెల 26న థియేటర్‌లో అభిమానులకు అదిరిపోయే సినిమాను అందించనున్నానని సూచన ప్రాయంగా చెప్పేశాడు. ఎందుకంటే, ఈ ట్రైలర్‌లో ఎమోషన్, లవ్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. ‘వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్లిపోయేటప్పుడు ఎందుకింత బాధ పెడుతోంది?’ అంటూ విజయ్‌ బాధపడుతూ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. రష్మిక గురించి ఆమె స్నేహితులకు ఫిర్యాదు చేస్తూ.. ‘కైసీ కర్తీ ఇస్సే దోస్తీ.. చాలా కష్ట్‌ హై’ అంటూ వచ్చీ రాని భాషలో విజయ్‌ చెప్పిన డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది. 

ఈ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత యూత్ అయితే ఊగిపోవ‌డం ఖాయం. మ‌రోసారి అదే ఆవేశం.. అవే ముద్దులు.. అదే కాలేజ్ బ్యాక్ డ్రాప్.. శివ టైప్ కాలేజ్ పాలిటిక్స్ అన్ని క‌లిపి డియ‌ర్ కామ్రేడ్ రేంజ్ ఎక్క‌డికో పెంచేసాయి. అస‌లు అర్జున్ రెడ్డి సినిమా చూసిన‌పుడు ఇలాంటి సినిమా రావ‌డానికి మ‌ళ్లీ ఎన్నేళ్లు ప‌డుతుందో అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మ‌ళ్లీ విజ‌య్ దేవ‌ర‌కొండే ఈ రికార్డు బ్రేక్ చేసేలా క‌నిపిస్తున్నాడు. ఈయ‌న క‌థల ఎంపిక ఇప్పుడు అంద‌రికీ మతిపోగొడుతోంది. ఇప్పుడు విడుద‌లైన డియ‌ర్ కామ్రేడ్ ట్రైల‌ర్ కూడా సినిమాపై అంచ‌నాల‌ను ఆకాశానికి చేర్చేసింది. క‌చ్చితంగా ఈ చిత్రంతో మ‌రోసారి చ‌రిత్ర సృష్టించేలా క‌నిపిస్తున్నాడు ఈ కుర్ర హీరో. భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైల‌ర్ నాలుగు భాష‌ల్లో విడుద‌లైంది.