Skip to main content
Latest News

కేటీఆర్ గారూ.. మరో ఘోరం జరగకముందే బాగుచేయండంటూ కోన వెంకట్ ట్వీట్

ఓ వైపు కుంభవృష్టితో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది.. వాహనదారులు నరకయాతన చూస్తున్నారు. గతంలో వానలు వస్తే.. ఏదైనా మెట్రో పిల్లర్ల కిందో.. లేక ఫ్లై ఓవర్ల కిందో నిలబడి.. వాన తగ్గాక వెళ్లేవారు. ఇప్పుడు ప్రయాణీకులు భయంతో ఆ ఆలోచనే చేయడం లేదు.. దానికి కారణం ఇటీవల అమీర్‌పేట్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర పెచ్చులూడిపడి మౌనిక అనే యువతి మృతిచెందడమే అని వేరుగా చెప్పనక్కర్లేదు. ఈ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. వాహనదారులంతా ఇప్పుడు ఎదురుగా ఏముందో చూస్తూ నడపడంతోపాటు.. పైన ఫ్లై ఓవర్లు, మెట్రో పిల్లర్లు ఎలా ఉన్నాయని కూడా చూస్తూ వెళ్తున్నారు. మౌనిక మరణంతో ఇప్పుడు అందరి దృష్టి ఫ్లైఓవర్లు, మెట్రో రైల్వే నిర్మాణాలపై పడింది. 

Read Also : కన్నీళ్లు తెప్పిస్తున్న ఉత్తేజ్ కవిత.. లవ్యూ వేణూ అంటూ..

ఈ నేపథ్యంలో సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్.. జీహెచ్ఎంసీ అధికారులు, మంత్రి కేటీఆర్ దృష్టికి ఓ విషయాన్ని తీసుకొచ్చారు. హైదరాబాద్‌ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు, సిటీ నుంచి ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఔటర్ రింగ్‌రోడ్డు వైపు వెళ్లేందుకు ప్రయాణికులు ఉపయోగించే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే డ్యామేజ్ అయ్యింది. పిల్లర్ నంబర్ 20 వద్ద పీవీ ఎక్స్‌ప్రెస్‌వే డ్యామేజ్ అయి ప్రమాదకరంగా మారింది.. అది కాస్తా అదే దారిలో వెళ్తున్న కోన వెంకట్ కంట పడింది.  అయితే, ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా.. జీహెచ్ఎంసీ, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లిన కోన వెంకట్.. ఆ డ్యామేజ్‌కు సంబంధించిన ఫొటోలను జత చేశాడు. ఎలాంటి ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై నెటిజన్లు వేగంగా స్పందించారు. ఆయన ట్వీట్ కింద.. మద్దతు తెలుపుతూ రీట్వీట్లు చేశారు. మరో మౌనిక ఇలా మరణించకముందే అధికారులు మేల్కోవాలని కోరారు. కాగా, వరుసగా దంచికొడుతున్న వర్షాలతో పాత కట్టడాలపై అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News