Skip to main content
Latest News

ఫిల్మ్‌ఛాంబర్‌లో వేణుమాధవ్ భౌతికకాయం.. చిరంజీవి నివాళులు

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం మౌలాలీలోని లక్ష్మీనగర్ శ్మశాన వాటికలో జరగనున్నాయి. గతకొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న వేణుమాధవ్.. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి నిన్న సాయంత్రం వేణుమాధవ్ పార్థీవదేహాన్ని మౌలాలీని హెచ్‌బీ కాలనీలో ఉన్న ఆయన ఇంటికి తరలించారు. అక్కడే చాలా మంది ప్రముఖులు వేణుమాధవ్‌కు నివాళులర్పించారు.

Also Read : కేటీఆర్ గారూ.. మరో ఘోరం జరగకముందే బాగుచేయండంటూ కోన వెంకట్ ట్వీట్

సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఈరోజు(గురువారం) మధ్యాహ్నం వేణుమాధవ్ పార్థీవదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు. ఆ సమయంలో మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నటుడు రాజీవ్ కనకాల, నాగబాబు, రఘుబాబు, హీరో రాజశేఖర్, జీవిత, మురళీమోహన్, ఉత్తేజ్, ఉదయభాను.. తదితర ప్రముఖులు వేణుమాధవ్‌కు నివాళులు అర్పించారు. 

ఫిలిం చాంబర్‌ నుంచి ప్రారంభమైన అంతియ యాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేణు మాధవ్‌ పెద్ద కుమారుడు ప్రభాకర్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నాడు. టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన వేణు మాధవ్‌ 400లకు పైగా సినిమాల్లో నటించారు. స్టార్‌ హీరోలు, స్టార్‌ డైరెక్టర్ల సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించారు. కొంత కాలంగా సినీరంగానికి దూరంగా ఉంటున్న ఆయన, కాలేయ సంబంధిత వ్యాదితో బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.

నల్గొండ జిల్లాలోని కోదాడలో జన్మించిన వేణుమాధవ్ మౌలాలీలో స్థిరపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా మారినప్పటికీ ఆయన ఫిల్మ్ నగర్ వైపు రాకుండా మౌలాలీలోనే ఉండిపోయారు. దీనికి కారణం అక్కడి వాళ్లతో ఆయనకు ఏర్పడిన అనుబంధం. మౌలాలీలోని హెచ్‌బీ కాలనీ వాసులతో వేణుమాధవ్‌కు మంచి అనుబంధం ఉంది. ఆ కారణంతోనే ఆయన ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి రాలేదు. ఇప్పుడు వేణుమాధవ్ మరణంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News