Skip to main content
Latest News

గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు.. సైరా నుంచి మరో ట్రైలర్..

బాహుబలి తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వస్తున్న సినిమా సైరా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సాగే ఈ సినిమాను చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్టుగా చేపట్టిన విషయం తెలిసిందే. సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేయగా.. యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ట్రైలర్ చూసి విమర్శకులు సైతం మెగాస్టార్‌కు ఫిదా అవుతున్నారు. అటు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా ట్రైలర్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు. బాలీవుడ్ టూ టాలీవుడ్ వరకు అంతా చిరంజీవి నటన చూసి పడిపోతున్నారు. సైరా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 34 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోన్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఈ సినిమాకు సంబంధించి మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. అది కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉండటంతో.. సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. 

Read Also : బాంబుపేల్చిన హీరోయిన్.. నా తొడల్ని చూడాలి.. అని ఒకరు వేధించారంటూ..

సినిమాలోని ప్రధానమైన యుద్ధ సన్నివేశాలను మచ్చుకగా చూపిస్తూ ఈ ట్రైలర్‌ను రూపొందించారు. ట్రైలర్‌లో చిరంజీవి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ‘‘ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. ట్యాక్స్‌లని 300 పర్సంట్ పెంచండి. బలగాలతో వెళ్లిన మన ఓడలన్నీ వాళ్ల బంగారంతో తిరిగిరావాలి’’ అని బ్రిటిష్ ఆఫీసర్ చెప్పే మాటలతో ట్రైలర్ మొదలైంది. ఆ వెంటనే.. ‘‘అది మనది, మన ఆత్మగౌరవం, గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు’’ అంటూ నరసింహారెడ్డి డైలాగ్ వచ్చింది. మొత్తానికి ఈ ట్రైలర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. మొత్తం ఆంగ్లేయులపై నరసింహారెడ్డి సమరాన్నే ఈ ట్రైలర్‌లో చూపించారు.  

ఈ ట్రైలర్‌లో చిరుతో పాటు సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు పాత్రలను కూడా ప్రధానం చూపించారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా లేడీ సూపర్‌ స్టార్ నయనతార చిరుకు జోడిగా నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : ముద్దుల కూతురి కోసం ఆమె భవిష్యత్‌తో చిరు ఆటలు.. మరో బాంబు పేల్చిన కత్తి మహేశ్

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News