Skip to main content
Latest News

దిల్‌రాజు-బాలయ్య కాంబినేషన్.. ఆ సినిమా రీమేక్..!

హిందీ బ్లాక్‌బస్టర్‌ ‘పింక్‌’ను తెలుగులోనూ తెరకెక్కించేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రీమేక్‌లో అమితాబ్‌ బచ్చన్‌ పాత్రను బాలకృష్ణతో చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిర్మాత దిల్‌రాజు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారట. ఈ మేరకు తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. మరోపక్క బాలయ్య, దిల్‌రాజు కాంబినేషన్‌లో ఓ సినిమా రావడం ఖాయమని చెబుతున్నారు. మరి ఆ ప్రాజెక్టు ఇదే అవుతుందా? లేక మరేదైనా కొత్త కథతో వస్తారా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

తాప్సి ప్రధాన పాత్ర‌లో తెర‌కెక్కి విజ‌య‌వంత‌మైన బాలీవుడ్ సినిమా `పింక్‌`. ఆ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర పోషించారు. ఆ సినిమా ప్ర‌స్తుతం త‌మిళంలోకి రీమేక్ అవుతోంది. త‌మిళ రీమేక్‌లో తాప్సి పాత్ర‌ను శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అమితాబ్ పాత్ర‌ను అజిత్ పోషిస్తున్నారు. తెలుగులోకి అమితాబ్ పాత్ర‌లోకి బాల‌య్య‌ను తీసుకోవాల‌నుకుంటున్న‌ట్టు స‌మాచారం. దిల్ రాజు ఇప్ప‌టివ‌ర‌కు బాల‌య్య‌తో ఒక సినిమా కూడా చెయ్య‌లేదు. అందుకే ఈ సినిమాను బాల‌య్య‌తో చేయాల‌నుకుంటున్నార‌ట‌. బాల‌య్య ఓకే అంటే వీలైనంత త్వ‌ర‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతున్న‌ట్టు స‌మాచారం. బాల‌య్య అంగీక‌రించ‌క‌పోతే మాత్రం వెంక‌టేష్‌, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోల‌ను సంప్ర‌దించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మరి బాలకృష్ణ, బిగ్‌ బీ నటించిన పాత్రలో సెట్ అవుతాడా..? లేక బాలకృష్ణకు తగ్గట్టుగా కథలో మార్పులు చేస్తారా? అన్న విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి!