Skip to main content
Latest News

‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ తండ్రిగా.. బాలీవుడ్ టాప్ హీరో

ఎన్నో అంచనాల మధ్య ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఇదే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, ఆయన పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో చెర్రీ తండ్రి పాత్రలో అజయ్‌ నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో ఆయన కూడా పాల్గొంటున్నట్లు తెలిసింది.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రెండో భాగంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ సీన్‌లో అజయ్‌ పాత్ర కనిపించనుందని సమాచారం. తన పాత్ర నిడివి తక్కువ కావడంతో తొలుత అజయ్‌ ఈ చిత్రంలో నటించేందుకు మొగ్గుచూపలేదట. కానీ, రాజమౌళి వ్యాఖ్యానం ఆయనకు సినిమాపై ఆసక్తిని పెంచినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ‘ఆర్‌.ఆర్.ఆర్‌’లో చెర్రీ సతీమణిగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మాత డీవీవీ దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరిన్ని సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి!