Skip to main content
Latest News

పెళ్లి కాకుండానే తల్లయిన అమీజాక్సన్.. ఇన్‌స్టాలో ఫొటోకు సూపర్ రెస్పాన్స్

బ్రిటీష్ సంతతికి చెందిన బాలీవుడ్ నటి అమీ జాక్సన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి అమీ జాక్సన్ దంపతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వార్తను షేర్ చేశారు. గత కొద్దికాలంగా జార్జ్ పనాయిటూతో సహజీవనం చేస్తున్న ఈ అందాల తార పెళ్లి కాకుండానే తల్లి కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నవజాత శిశువుకు అమీ జాక్సన్ దంపతులు స్వాగతం పలుకుతూ.. తన ప్రపంచంలోకి ప్రవేశించిన మా ఎంజెల్ ఆండ్రియాస్‌కు ఘన స్వాగతం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పోస్టు చేశారు. హాస్పిటల్‌లో బెడ్‌పై చిన్నారిని కౌగిలిలో చేర్చుకొని ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అమ్మగా అమీ చేసిన వినూత్న ప్రయత్నం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. 

తల్లీపాలు బిడ్డకు ఎంత ముఖ్యమో చెప్పడానికి అమీ జాక్సన్‌ తన కొడుక్కి పాలిస్తూ దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రసవించిన వెంటనే బిడ్డకు పాలిస్తూ.. తల్లీపాల ఆవశ్యకతను చాటుతూ పెట్టిన ఫొటోపై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘యాండ్రియాస్‌.. మా ఏంజెల్‌. ఈ ప్రపంచానికి స్వాగతం’ అని క్యాప్షన్‌ చేస్తూ పాపతో దిగిన ఫొటోను ఆమె షేర్‌ చేశారు. జార్జి పనయొట్టుతో అమీ జాక్సన్‌ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి నిశ్చితార్థం కూడా అయింది. ఇంకా పెళ్లి కాలేదు. ‘ఎవడు, ఐ, 2.0’ సినిమాల్లో  అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటించారు. ఇండియాలోని పలు భాషల్లో నటించిన అమీ జాక్సన్‌ హాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేశారు. డాన్సర్‌గా, సింగర్‌గా, నటిగా నిరూపించుకున్న జాక్సన్‌.. సామాజికంగానూ ముందుంటానని చెప్పారు.

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News