Skip to main content
Latest News

కన్నీళ్లు తెప్పిస్తున్న ఉత్తేజ్ కవిత.. లవ్యూ వేణూ అంటూ..

హాస్యనటుడు వేణుమాధవ్ మరణం ప్రతిఒక్కరిని కలిచివేస్తుంది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన బుధవారం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు. గురువారం అంత్యక్రియలు జరుగుతున్నాయి. అయన మరణం పట్ల తెలుగు సినీరాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయన మరణం చిత్రపరిశ్రమకి తీరని లోటని చెబుతున్నారు. వేణుమాధవ్‌తో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకొని విలపిస్తున్నారు. ఈ నేపధ్యంలో నటుడు ఉత్తేజ్ వేణుమాధవ్‌తో ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకున్నారు. వేణుమాధవ్ తనకి మిమిక్రి ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటినుండి తెలుసునని, చాలా మంచి వ్యక్తి అని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేని వారి లిస్టు రాయించి నిర్మాతలకు చెప్పి తన పక్కన వేషాలు ఇప్పించేవాడని అన్నారు. సినిమా అవకాశలు లేని వారికీ డబ్బులు ఇస్తే తాగుతారని రెండు నెలలకి సరిపోయే రేషన్ సరుకులను వారి ఇంటికి పంపించేవాడని ఉత్తేజ్ చెప్పుకొచ్చాడు. 

Also Read : ఫిల్మ్‌ఛాంబర్‌లో వేణుమాధవ్ భౌతికకాయం.. చిరంజీవి నివాళులు

బాధాకరమైన విషయాలను కవితలతో చెప్పి.. అందరి హృదయాలను మేల్కొల్పే ఉత్తేజ్.. తన ప్రియ మిత్రుడు వేణుమాధవ్ మరణంపై కూడా ఓ కవితను రాశాడు. దాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. అది చదివిన వారందరూ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆయన రాసిన కవిత.. యథాతథంగా.. 

‘మిస్ యూ వేణూ..!
చాలా మంచోడివి డార్లింగ్ నువ్వు..
ఎన్ని నవ్వుల్ని పంచావ్..
ఎన్ని అనుభూతుల్ని పంచుకున్నావ్..
ఒకటా.. రెండా..
నీతో గడిపిన ప్రతిక్షణం
గుర్తుండిపోయేలా చేయడం నీకే సాధ్యం..
కలిసి అమలాపురమెళ్లినా..
కలిసి అమెరికాకు వెళ్లినా..
నువ్వు మారవ్.. నీ స్నేహం మారదు.. నీ తీరు మారదు..
నీ వ్యక్తిత్వం మారదు.. 
నీతోపాటు పదిమంవదీ బావుండాలి.. 
షూటింగ్స్‌లో బిజీగా ఉండాలి.. 
పదిమందితో కలిసి భోజనం చేయాలి.. అందరూ పచ్చగా ఉండాలి.. అని కోరుకునే స్నేహ  పిచ్చోడివి.. 
అందరి గురించీ ఆలోచిస్తూ.. 
నీ గురించి ఆలోంచించుకోకే.. ఇలా జరిగిందేమో..
నా చివరంటా గుర్తుంటావ్.. లవ్ యూ..

 .....ఉత్తేజ్

మరిన్ని  సినిమా వార్తల కొరకు మా మూవీస్ పేజీ ని వీక్షించండి .. 

Tollywood News