Skip to main content
Latest News

అర్ధరాత్రి ప్రేయసితో పరారవుతోంటే.. ఆమె తండ్రి సడన్ ఎంట్రీతో..

ప్రియురాలితో కలిసి పరారవుతోంటే.. సడన్‌గా ఆమె తండ్రి ఎంట్రీ ఇచ్చాడు.. కూతురితో సహా ఉన్న ఆమె ప్రియుడిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. చక్కగా పెళ్లి చేస్తే.. బంగారం లాంటి భర్తతో బుద్ధిగా కాపురం చేసుకోక.. ఇదేం పనంటూ నిలదీశాడు.. వారిద్దరినీ అడ్డగించి ఆమెను ఇంట్లోకి లాక్కొచ్చేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమయిన ప్రియుడు.. ఆమె తండ్రిపై కలబడ్డాడు.. కత్తితో అతడి గొంతు కోసి తీవ్రంగా గాయపరిచి.. పరారయ్యాడు.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తితో మంగళవారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన.. 

అనపర్తి పాత ఊరికి చెందిన చింతపల్లి శేషారత్నం అనే మహిళకు వివాహం అయింది. భర్త ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటుంటాడు.. దీంతో ఆమె తన కుమార్తెను రోజూ స్కూలుకు పంపించి.. స్వయంగా తీసుకుని వస్తుండేది.. ఈ క్రమంలోనే స్కూలు బస్సు క్లీనర్‌తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. భర్త తనతో లేకపోవడంతో భర్త ఇచ్చే ప్రేమను అతడి ద్వారా పొందాలనుకుంది. బస్సు క్లీనర్‌తో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన ఆమె తండ్రి వెంకటేశ్వరరావు.. ఒకటికి రెండుసార్లు శేషారత్నాన్ని మందలించాడు. అయినా ఆమె పెడచెవిన పెట్టింది. ఇక్కడే ఉంటే మన బంధాన్ని చెడుగా చూస్తారంటూ.. ఎక్కడికైనా పారిపోయి బ్రతకాలని నిశ్చయించుకున్నారు. దీనికోసం పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. మంగళవారం అర్థరాత్రి శేషారత్నం ప్రియుడితో పరారయ్యేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన ఆమె తండ్రి వెంకటేశ్వరరావు, శేషారత్నాన్ని మందలించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె ప్రియుడు.. వెంకటేశ్వరరావు గొంతు కోసి అక్కడినుంచి పరారయ్యాడు. గాయపడ్డ వెంకటేశ్వరరావును స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శేషారత్నాన్ని అదుపులోకి తీసుకుని.. అతడి గురించి వివరాలు సేకరిస్తున్నారు..