Skip to main content
Latest News

ఆమెకు ఎం కావలి।

                           
స్త్రీలకు  పురుషులు  ఇచ్చే  వస్తువులు  ఆభరణాలు  కన్నా  ముఖ్యమైనది  తాను  ఆమె  పట్ల  చూపించే  ప్రేమ  ఆదరణ.

      ఈ  ఆధునిక  యుగంలో  పురుషులతో  సమానంగా  స్త్రీలు  కూడా  ఉద్యోగాలకి  వెళ్ళటం  సర్వసాధారణం  అయిపోయింది  ఈ  ఉరుకుల  పరుగుల జీవితంలో   రోజంతా  కస్టపడి  పని  చేసి  ఇంటికి  వచ్చిన  ఆమెకు  తన  బీరువాలో  ఉన్న  చీరలు ,నగలు  సంతోషాన్ని  ఇవ్వలేవు  అలసటని  తీర్చలేవు. రోజంతా  ఆఫీసు  లో  పని  చేసి  అలసిన  ఆమెకు  కావలసినది  కేవలం  ఆప్యాయంగా  ఒక  పలకరింపు  ప్రేమతో  ఒక  ఆలింగనం . పనికి ( జాబ్ ) వెళ్లే  పురుషులు  ఇంటికి  వచ్చేసరికి  ఆమె  అతనిని  ఎలా ప్రేమగా  ఆప్యాయంగా   రిసీవ్  చేసుకోవాలనుకుంటాడో  అదే  ప్రేమానురాగాలు  స్త్రీలు కోరుకునేది 
 

ఎందుకంటె  ఆఫీసుకు  వెళ్లే  స్త్రీలు  కూడా  పురుషలకు  సమానంగా  పని  ఒత్తిడికిలొనౌతున్నారు , పురుషులకి  సమానంగా  బాధ్యత  వహిస్తున్నారు. ఇంటి పని   మరియు  ఆఫీస్  పని  రెండూ  బ్యాలెన్స్   చేసుకుంటున్న  స్త్రీలకి   ప్రేమగా  ఒక  పలకరింపు ,ఒక  చిన్న సహాయం,   ఎంతో  ఓదార్పునిస్తాయి తనకు  ప్రపంచాన్ని  గెలవగలిగినంత  శక్తినిఅందిస్తాయి.


    తనకున్న  సమస్యల్ని  ఓర్పుగా  విని  ఒక  చిన్న  సలహా  ఇచ్చినా ,ఉదయం  పిల్లల్ని  రెడీ  చేసి  వారికీ  అల్పాహారం  తినిపించి  స్కూలుకి  పంపించే పనిలో  సహాయం చేసినా, ఇంటి  పనిలో  కాస్త  సహాయం  చేసినా  ఎంతో  ఆనందిస్తుంది  స్త్రీ. అందువల్ల  ఆమె  సంతోషకరమైన జీవితం, ప్రేమ, సహాయం  మరియు  సహకారాన్ని  కోరుకుంటుందని  పురుషులు  గ్రహించగలిగితే  చాలు. తనకి  కావాల్సినవి  అడగకముందే  గ్రహించి  ఇవ్వగలిగితే  తాను  ఎంతో  సంతోషిస్తుంది.

మరిన్ని చిట్కాల కొరకు మా స్త్రీల కొరకు పేజీ ని వీక్షించండి!

Ladies Special