Skip to main content
Latest News

లడ్డూలు గట్టిపడ్డాయా..? మళ్లీ తాజాగా మారిపోవాలంటే..

వంటింటి చిట్కాలు.. ఇవే మహిళలకు ఆయుధాలు.. వంటింట్లో పాడయిపోయే అవకాశాలు ఉన్న వాటన్నింటినీ.. ఎలా సరైన రీతిలో వాడుకోవాలో తెలుసుకునే ఆయుధాలు. అందుకే మన భారతీయ మహిళలు వంటింటి చిట్కాలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంటారు. కూరలో ఉప్పెక్కువైనా ఒక్క చిట్కాతో తగ్గిస్తుంటారు. పెరుగు పులిసిపోయినా చిటికెలో సరిచేస్తారు. అన్నం పాడవుతున్నా.. కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండకపోయినా.. సమస్య ఏదైనా సరే.. పరిష్కారం ఇట్టే చెప్పేస్తారు. చిన్న చిన్న చిట్కాలే వంటింట్లో అక్కరకు వస్తుంటాయి. మరి ఆ చిట్కాల్లో కొన్నింటిని తెలుసుకుందామా..?

గంజిలో విటమిన్స్ అధిక మోతాదులో ఉంటాయి. చలికాలం అయితే అందులో కాస్త తేనె, నారింజరసం కలుపుకొని తీసుకుంటే రుచిగా ఉంటుంది.

చీమల బెడద ఉంటే కొద్దిగా ఉప్పు తీసుకొని ఇంట్లోని తలుపులు, కిటికీలు, షెల్ప్‌ల వంటి ప్రాంతాల్లో ఉంచితే చాలు.

గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి కిచెన్ సింక్‌ను క్లీన్ చేస్తే జిడ్డు తొలిగి అందులో ఇరుక్కున్న పదార్థాలన్నీ పోతాయి.

ఉప్పులో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి రాగి, వెండి, ఇత్తడి పాత్రలను తోమితే అవి తళతళా మెరుస్తాయి.

బీట్‌రూట్‌ను సన్నగా తురిమి ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకొని ఫుడ్ కలర్‌గా ఉపయోగించుకోవచ్చు.

అల్లం, మిరియాలు, యాలకులు మెత్తని పొడిలా చేసి.. టీలో కలిపితే రుచి రావడమే కాకుండా అజీర్తికి సంబంధించిన వ్యాధులు దరిచేరవు.

లడ్డూలు గట్టిపడిడితే వాటిని బాగా పొడిచేసి ఒక లడ్డుకి చెంచా చొప్పున పాలు పోసి కలిపితే తాజా లడ్డులా తయారవుతాయి.

హాట్ వాటర్‌బాటిల్‌లో ఎక్కువసేపు నీరు వేడిగా ఉండాలంటే చిటికెడు ఉప్పు ఆ నీటిలో కలిపితే చాలు.

బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే వేపాకు వేసి నిల్వ ఉంచుకోవాలి.

సీసాలోని పచ్చళ్లు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. సీసామూత చుట్టూ ఉప్పు రాయండి.

పప్పులు నిల్వ చేసేటప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే.. డబ్బా అడుగుభాగంలో క్రిస్టల్ ఉప్పు చల్లాలి.

మరిన్ని చిట్కాల కొరకు మా స్త్రీల కొరకు పేజీ ని వీక్షించండి!

Ladies Special