Skip to main content
Latest News

ఆపిల్ ముక్క రంగు మారుతోందా..? (వంటింటి చిట్కాలు)

వంటంటే ఇష్టం ఉండే వాళ్లు చాలా మంది ఉంటారు. వంటనే వృత్తిగా ఎన్నుకునేవాళ్లు అనేకమందే. రోజూ కంప్యూటర్‌తో కుస్తీ పట్టేవాళ్లలో కూడా మంచి నలభీములు ఉండవచ్చు. అలాంటి వారి కోసమే ఈ ఇంట్రెస్టింగ్ టిప్స్. అవునండి ఈ చిన్న చిన్న చిట్కాలు, మీకు మరిన్ని విషయాలు తెలిసేలా చేస్తాయి. సమయాన్ని తగ్గించేలా చేస్తాయి. కొన్ని అవసరం లేనివని పారేసే వస్తువుల ఉపయోగాలేంటో తెలుస్తాయి. వంటలో అప్పుడప్పుడు చేసే తప్పులను.. ఎలా సరి చేసుకోవాలో చెప్తాయి. మరి అలాంటి కొన్ని టిప్స్‌ను మీరూ ఓ లుక్కేయండి..

ఆపిల్ ముక్కలపై నిమ్మరసం చల్లడం వల్ల రంగు మారకుండా తాజాగా ఉంటాయి.

పుట్టగొడుగుల్ని వండేముందు పొడి వస్త్రంతో తుడిచి ఆ తర్వాత నీటితో కడిగి మరలా బట్టతో తుడువాలి. ఇలా చేస్తే పుట్టగొడుగుల్లోని దుమ్ము నశిస్తుంది. 

ఆకుకూరల్ని కోయడానికి ముందు పెద్ద గిన్నెలో సగానికి నీరు పోసి అందులో ఉంచాలి. ఆ నీటిలో కొంచెం సోడా కలుపాలి. ఆ తర్వాత ఆకుకూరల్ని బయటకు తీసి మంచినీటితో కడిగి వండుకోవాలి.

దోమలు, బొద్దింకలు బాగా తిరిగే చోట కోడిగుడ్డు పెంకులను ఉంచితే వాటి బెడద తగ్గుతుంది.

పన్నీర్‌ను ఉడికించేటప్పుడు వాటిలో కొద్దిగా ఉప్పు కలుపుకొంటే మంచి ఫలితం ఉంటుంది.

చపాతీలు మృదువుగా రావాలంటే పిండిని కలుపుకొనేటప్పుడు అందులో కొద్దిగా మక్కజొన్న పిండి, పాలు కలుపుకొంటే చాలు.

నూడుల్స్ విరిగా రావాలంటే వాటిని చల్లని నీటితో వేసుకుంటే మంచిది.

ఆలుగడ్డలు ఉడికించిన తర్వాత తొక్కతీస్తే అంత త్వరగా రాదు. అలాంటప్పుడు అవి ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే తొక్క తేలికగా వస్తుంది.

బఠాణీలు ఉడికించేటప్పుడు వాటిలో కొద్దిగా చక్కెరను కలుపుకొంటే రంగు మారకుండా ఉంటుంది.

పప్పు త్వరగా ఉడకాలంటే అందులో కొంచెం నూనె కలుపుకోవాలి.