Skip to main content
Latest News

పాలు విరిగిపోయాయా..? అయితే ఇలా ట్రై చేయండి..

కాలం ఏదైనా, కారణాలు ఏవైనా కొన్నిసార్లు పాలు విరిగిపోతుంటాయి. పాలు విరిగిపోయాయని బాధ పడకండి.. ఒక్కసారి ఇలా చేసి చుడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ...పాలు విరిగిపోయిన తరువాత నీళ్ళని వడగట్టి పాల పిప్పిని వేరుచేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు చెంచాల నెయ్యి వేసుకొని జీడీపప్పు బాదాం పప్పు ముక్కలుగా చేసుకుని వేయించుకోవాలి వేయించిన జీడిపప్పు బాదంపప్పు ఒక బౌల్ లోకి తీసుకొని అదే బాండీ లో పాల పిప్పిని వేసి ఇంకొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మీ పాల క్వాంటిటీ కి సరిపడా మీ టేస్ట్ కి సరిపడా పంచదార వేసుకొని అడుగు అంటకుండా కలుపుకోవాలి నెయ్యి పైకి తేలేవరకు కలుపుతూ ఉండాలి నెయ్యి పైకి తేలాక ముందుగా వేయించుకున్న జీడిపప్పు బాదాం పప్పు వేసి కలుపుకోవాలి అలాగే ఇలాచీ పొడి వేసి మరొక్కసారి కలిపి కించెం చల్లారాక మీకు నచ్చిన షేప్ లో బర్ఫీ లాగా చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే స్వీట్ షాప్స్ లో దొరికే కలాఖండ్ రెడీ పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. దీనితోపాటు విరిగిపోయిన పాలతో మరిన్ని ప్రయోగాలు చేయొచ్చు.. అవేంటంటే..

విరిగిపోయిన పాలతో స్వీట్‌ కోవా తయారు చేసుకోవచ్ఛు లేదంటే గుడ్డు కలిపి చక్కని స్మూథీగానూ ప్రయత్నిం చొచ్ఛు పాన్‌కేక్‌లూ చేసుకోవచ్ఛు

ఈ పాలను పూలకుండీకి ఎరువుగా వేయండి. దీనిలో ఉండే క్యాల్షియం మొక్కని ఆరోగ్యంగా ఉంచుతుంది. టొమాటో మొక్కకు ఇది మంచి ఎరువు.

చేపల్ని శుభ్రపరిచేప్పుడు ఈ పాలను వాడండి. అవి సులభంగా శుభ్రపడటమే కాదు కూరకూ మంచి రుచి వస్తుంది.

పొడిచర్మం ఉన్నవారు ఈ పాలలో తేనె కలిపి ముఖానికి రాసి కడిగేయాలి. చర్మం మృదువుగా మారుతుంది.

మరిన్ని చిట్కాల కొరకు మా స్త్రీల కొరకు పేజీ ని వీక్షించండి!

Ladies Special