Skip to main content
Latest News

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా ?

ఇటీవల ఎక్కువమంది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లోనే  అన్నం వండుతున్నారు. పని త్వరగా అవుతుంది కదా అని అనుకునేవారికి రోగాల బారినపడే అవకాశము ఎక్కువే. ఒకప్పుడు పట్టణంలో ఉన్న ఈ అలవాటు ఇప్పుడు పల్లెలకు కూడా తాకింది. అయితే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో వండిన ఆహరం తింటే అనర్ధాలు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు.

 

  • వంటల్లో అల్ల్యుమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది . ముఖ్యంగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో వండిన  అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు ,కీళ్ల నొప్పులు ,నడుం నొప్పి వస్తుందని  వైద్యులు చెబుతున్నారు.
  •  ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్ తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగవుతాయి.
  • నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • నాన్ స్టిక్ వస్తువులను వినియోగించి వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్ కు దారి తీస్తాయి. సాధ్యమైనంత వరకు ఇవి వాడకపోవడం మంచిది.
  • రాగి సంకటి ,రాగి జావ,జొన్న రొట్టెలు కొర్రలతో అల్పాహారం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నం త్వరగా వండాలనుకున్నప్పుడు ప్రెజర్ కుక్కర్ లో వండితే  ఆరోగ్యానికి మేలు. కరెంట్ ఆధారంగా ఉడికిన ఆహరం తీసుకోకపోవడమే మంచిది.
  • మట్టి పాత్రలు,లేదా స్టీల్ పాత్రల్లో అన్నం ఉడికించుకుని తీసుకోవడం మేలు. మట్టి పాత్రల్లో అన్నం ఉడికించడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచిని ఇస్తాయి. ప్రెజర్ కుక్కర్ లో అన్నం ఉడికించడం వల్ల పోషకాలు ఆవిరి రూపంలో కరిగిపోకుండా ఉంటాయి.

ఈ జాగ్రత్తలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని చిట్కాల కొరకు మా స్త్రీల కొరకు పేజీ ని వీక్షించండి!

Ladies Special