Skip to main content
Latest News

వంటింటి మహారాణులూ.. ఈ చిట్కాలను తెలుసుకోండి..

టొమాటోలను ఉడికించి, తగినంత ఉప్పు కలిపి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌ ట్రేలలో పోసి డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచాలి. టొమాటో ఐస్‌క్యూబ్స్‌ను ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో వేసి ఫ్రీజర్‌లోనే ఉంచాలి. అవసరమైనప్పుడు సూప్‌లు, కూరలలో గ్రేవీగా వాడుకోవచ్చు. 
   
పాలు పొంగి అంచుభాగం అంతా పాల మరక పట్టుకునే ఉంటుంది. ఇలాంటప్పుడు, పాలు మరిగించడానికి ముందు పాత్ర పై అంచు భాగాన నెయ్యి రాస్తే పాలు త్వరగా పొంగవు, పొంగినా అంచుకు మరక పట్టదు. 

వంటలలో ఉప్పు ఎక్కువైతే టొమాటో ముక్కలు లేదా బంగాళదుంప ముక్కలు లేదా టీ స్పూన్‌ పంచదార వేయాలి. 

నిమ్మకాయలను ఫ్రిజ్‌లో నిల్వచేసేముందు వాటి పైన కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే ఎక్కువ కాలం మన్నుతాయి. 

అన్నం ముద్దగా కాకుండా ఉండాలంటే ఉడికేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి.

పాలు విరిగిపోతాయని అనుమానంగా ఉంటే కాచేటప్పుడు చిటికెడు వంటసోడా వేస్తే సరి. 

నెయ్యి కాచి దించేముందు కాసిని మెంతులు లేదా తమలపాకు వేస్తే సువాసనగా ఉండటంతోపాటు నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉన్నా, తాజాగా ఉంటుంది. 

ఇంటికి అతిథులు వచ్చారు. ఆధరువులన్నీ వడ్డించారు కానీ, సమయానికి మజ్జిగ సరిపోవని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు కాసిని గోరువెచ్చటి పాలలో చిటికెడు ఉప్పు వేసి, నిమ్మ రసం పిండితే సరి. మజ్జిగలా తయారవుతుంది. 

కూరలో ఉప్పు ఎక్కువైందనుకోండి, కంగారు పడకండి, రెండు స్పూన్ల పాలమీగడ కలిపెయ్యండి... ఉప్పదనం కాస్తా పరారైపోయి, యమా టేస్టీగా తయారవుతుంది కూర. 

బెండకాయముక్కల్ని ముందుగా కాస్త వేయించి, ఆ తర్వాత ఉడకబెట్టి వండితే, జిగటగా ఉండకుండా, వేటికవి విడివిడిగా వస్తాయి ముక్కలు. 

క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటివి ఉడికించేటప్పుడు అదొకరకమైన వాసన వేస్తాయి. అలా వాసన రాకుండా ఉండాలంటే, చిన్న బ్రెడ్‌ ముక్క వేయాలి లేదా స్పూను పంచదార వేయాలి. 

పులిహోర చేసేటప్పుడు, అన్నం పొడపొడలాడుతూ రావాలంటే, అన్నం ఉడికేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక స్పూను నూనె వేస్తే, అన్నం తెల్లగా మల్లెమొగ్గల్లా, పొడిపొడిగా వస్తుంది.

మరిన్ని చిట్కాల కొరకు మా స్త్రీల కొరకు పేజీ ని వీక్షించండి!

Ladies Special