Skip to main content
Latest News

షాకింగ్ న్యూస్: ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయాలు..!?

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొన్న ఎన్టీఆర్‌కు గాయాలయినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రామ్ చరణ్.. కసరత్తులు చేస్తున్న సమయంలో గాయాలపాలయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్‌కు కూడా గాయాలయినట్లు ఫిల్మ్ నగర్ టాక్.. షూటింగ్‌కు వెళ్తున్న ఎన్టీఆర్ ఫొటోలను బాగా పరిశీలించి చూస్తే.. ఆయనకు  గాయాలయినట్లు తెలుస్తోందని చెబుతున్నారు. కుడి చేతికి కట్టుతో ఉన్న ఎన్టీఆర్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే గాయం పెద్దది కాకపోవటంతో ఎన్టీఆర్ యథావిదిగా షూటింగ్‌కు వెళ్తున్నాడట.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,  రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. రామరావణ రాజ్యం అనే టైటిల్‌ను పెడతారంటూ వార్తలు వస్తున్నా.. టైటిల్‌ను అభిమానుల నుంచే స్వీకరిస్తామంటూ రాజమౌళి ప్రకటన చేశారు. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్‌కు జోడీగా మొదట్లో ఓ హాలీవుడ్ భామను అనుకున్నా.. ఆమె అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో మరో నటి కోసం అన్వేషణ ప్రారంభించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నాడు. 2020లో ఈ సినిమా విడుదలవుతుందని రాజమౌళి ముందే చెప్పేశారు.