Skip to main content
Latest News

జెర్సీ దర్శకుడికి.. బంపరాఫర్.. ఈసారి ఏకంగా..

జెర్సీ సూపర్ హిట్ తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి జోరు పెంచారు. మళ్లీరావా అంటూ కూల్ హిట్ కొట్టి.. ఆ తర్వాత జెర్సీతో సూపర్ హిట్‌ను అందుకున్న గౌతమ్.. ఈసారి మెగా ప్రాజెక్ట్‌ను రూపొందించే పనిలో పడ్డాడట. తంతే ఏకంగా బూరెల బుట్టలో పడ్డట్టు.. ఈ సారి ఏకంగా ఓ మెగా హీరోను డైరెక్ట్ చేసే యోచనలో ఉన్నారట. ఎమోషన్స్‌ను చక్కగా తెరకెక్కించగలిగే నేర్పరి అయిన గౌతమ్‌కు.. మెగా ఫ్యామిలీ నుంచి మాంచి ఆఫర్ వచ్చిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రస్తుతం జెర్సీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న గౌతమ్‌ తన తదుపరి చిత్రాన్ని మెగా హీరోతో చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మెగా హీరో అయినా.. మాస్ మసాలా మూవీల జోలికి వెళ్లకుండా విభిన్న చిత్రాలను చేస్తూ పోతున్న వరుణ్‌తేజ్‌ను ఈసారి గౌతమ్ డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రాబోతున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తారట. ప్రస్తుతం వరుణ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈలోపు గౌతమ్ కథను రెడీ చేస్తారట. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు ఎప్పుడు కొబ్బరికాయ కొడతారో.. వేచిచూడాలి.