Latest News

మహాకూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ______ ??? రాహుల్ గాంధీ ప్రకటన

దేశ రాజకీయాల్లో మార్పుకు తెలంగాణ ఎన్నికలే ఆరంభం అని రాహుల్ గాంధీ అన్నారు.  మహాకుటమి నేతల మీడియా సమావేశం లో మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో తెలంగాణ ప్రజల కలలు సాకారమవుతాయని అనుకున్నాం కానీ, సాకారం కాలేదని రాహుల్ అన్నారు.  దేశానికి వెన్నెముక ఐన రైతులను అటు మోదీ, ఇటు కేసీఆర్ ఇద్దరు మోసం చేశారని రాహుల్ విమర్శించారు.   కెసిఆర్ ను గద్దె దింపడమే తమ ముందున్న ముఖ్యమైన లక్ష్యం అనీ రాహుల్ గాంధీ అన్నారు.  మహాకూటమి లో ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడే చెప్పలేమని ఒక ప్రశ్న కు సమాధానంగా రాహుల్ గాంధీ చెప్పారు.