Latest News

సమయమా.. సమయమా.. అంతరిక్షం రొమాంటిక్ లిరికల్ విడుదల:

రానా హీరోగా సబ్ మరైన్ యుద్ద నేపథ్యం లో వచ్చిన ‘ఘాజీ’ దర్శకుడిగా సంకల్ప్ రెడ్డి మొదటి సినిమా.  తొలి సినిమా తోనే మంచి మార్కులు సంపాదించిన సంకల్ప్ రెడ్డి ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట గా ‘అంతరిక్షం’. 9000 కెఎంపిహెచ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతోంది. “సమయమా.. అదేమిటంత తొందరేంటి ఆగుమా!! సమయమా.. అంటూ సాగే ఒక రొమాంటిక్ పాట ని విడుదల చేసింది అంతరిక్షం టీం.  మెగా ప్రిన్స్ వరుణ్, తేజ్ లావణ్య త్రిపాఠి జోడీగా నటిస్తున్న ‘అంతరిక్షం’ మూవీ నుండి తొలిసాంగ్‌ను శుక్రవారం నాడు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే వైవిధ్యమైన చిత్రాల ద్వారా హిట్స్ సాధిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘అంతరిక్షం’ ఇప్పటికే మంచి హైప్ ను క్రియేట్ చేసింది.  ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంకల్ప రెడ్డి దర్శకత్వం వహించారు.  అనంత్ శ్రీరాం కలం నించి జాలు వారిన అందమైన గీతానికి ప్రశాంత్ విహారి సంగీతం అందించగా హరిణి, యాజిర్ నిహార్ లు ఆలపించారు.  ఘాజీ లో పూర్తిగా సముద్రంలో సబ్ మరైన్ లో చిత్రీకరించగా..అంతరిక్షం చిత్రాన్ని పూర్తి

సైన్స్ ఫిక్షన్‌‌గా జీరో గ్రావిటీ సెట్స్‌‌పై చిత్రీకరిస్తున్నారు. ట్రాయ్, జీరో డార్క్, గేమ్ ఆప్ థ్రోన్స్ వంటి హాలీవుడ్ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయడం మరో విశేషం. వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, అతిధి రావు హైదరీ , సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.  రోబో 2.0 తర్వాత రానున్న మరో విజువల్ వండర్ ఈ...అంతరిక్షం....