Latest News

100 రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామంటున్న రేవంత్ రెడ్ది

కేసీఆర్‌ ఉద్యోగం పోగొడితే 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలిచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, నిరుద్యోగులకు కేసీఆర్‌ అన్యాయం చేశారని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, కొడంగల్‌ నియోజకవర్గం ప్రజాకూటమి అభ్యర్థి, రేవెంత్ రెడ్డి అన్నారు.  బోమరాస్‌పేట్‌లో నిర్వహించిన ఎన్నికల రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ వికారాబాద్‌ జిల్లాకు తెరాస ప్రభుత్వం డబుల్‌ రోడ్డు ను, బోమరాస్‌పేట పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.  నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన తనను ఓడించాలా? అని రేవంత్ ప్రశ్నించారు.  గల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డిని దిల్లీలో ఉన్న రాహుల్‌ గాంధీ గుర్తించారని రేవంత్ అన్నారు.  కేసీఆర్‌ నల్లత్రాచు లాంటి వారని, నల్లత్రాచును తొక్కి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అయన వ్యాఖ్యానించారు.  ఈ 48 గంటలు ప్రజలంతా అప్రమత్తంగా వుండి, ఊర్లోకి కొత్తవాళ్లెవరైనా వస్తే పట్టుకోండని పిలుపునిచ్చారు.  కూటమే అధికారంలోకి వస్తుందని లగడపాటి సర్వేలో తేలిందనీ, పది రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రైతులు ఎవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దని, తాకట్టులో ఉన్న పాసు పుస్తకాలన్నీ రైతుల ఇళ్లకు తానే తీసుకొచ్చి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5లక్షలు ఉచితంగా అందిస్తామని, 58 ఏళ్లు నిండిన పేదలందరికీ పింఛన్‌ ఇస్తామని, పేదలకు రేషన్‌లో సన్నబియ్యం, ఇంటికి ఆరు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.