Latest News

ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ హిందీ మూవీ ట్రైలర్

హాలీవుడ్ లో యుద్ధం, దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ చిత్రాలు నిర్మిస్తారు.. మనదేశంలో ఆ నేపథ్యంలో తీసే చిత్రాలు తక్కువే.. ఈ మధ్య తెలుగు, తమిళ్ లో కూడా ఇలాంటి వైవిధ్యమైన కథలతో సినిమాలు వస్తున్నాయి.  తెలుగు లో వచ్చిన ఘాజీ లాంటి చిత్రాలు యుద్ధ నేపథ్యంలో వచ్చాయి.  హిందీలో బోర్డర్, ఆ కోవకు చెందిన చిత్రమే ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్.  బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జమ్ము కశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లోపాకిస్తాన్ జరిపిన దాడులకు భారత సైన్యం ప్రతీకార చర్యగా పాక్‌ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడుల నేపథ్యంలో నిర్మించారు.  ఈరోజు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.  ఆర్‌ఎస్‌వీపీ మూవీస్‌ బ్యానర్‌పై రోన్నీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‌