Skip to main content
Latest News

రజనీకాంత్-శంకర్ ల మాయాజాలం - చిట్టి రిలోడేడ్ - రోబో 2.0

నాలుగేళ్ళ శ్రమ,  500 కోట్ల భారీ బడ్జెట్, సాంకేతిక అద్భుతాలు సృష్టించే దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ ఇవన్నీ కలిస్తే ....వెరసి రోబో 2.౦.

 

రోబో సినిమా ఎంత బాక్స్ ఆఫీస్ సునామి సృష్టించిందో అందరికి తెలుసు.  ఆ చిత్రంలో చిట్టి రోబో గా రజిని అందరినీ ఆకట్టుకున్నాడు... పిల్లలిని, పెద్దలిని అలరించిన సినిమా అది.  రోబో సీక్వెల్ గ వచ్చిన 2.౦ మరిన్ని హంగులతో, టెక్నాలజీ అబ్దుతాలతో మన ముందుకు వచ్చింది..నిర్మాణంలో ఎంతో జాప్యం జరిగినా ..ప్రేక్షకులు అంతే ఆసక్తిగా ఎదురుచుసారు.. దానికి తోడు ట్రైలర్ మరింత ఆసక్తి ని రేకేత్హించాడంతో..అంచనాలు మరింత పెరిగిపోయాయి...మొదటి రోజు బాక్స్ ఆఫీస్ ని కొల్లగోడుతున్నాడు రజిని.  మరి ఇన్ని ప్రత్యేకతలున్న రోబో టూ పాయింట్ ఓ ఎలావుందో చూద్దామా..

 

మొబైల్ ఫోన్ లు, ఇంటర్నెట్ రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో... అన్ని వర్గాల ప్రజల జీవితాలని శాసిస్తోంది.. మొబైల్ ఫోన్...ఆ మొబైల్ ఫోన్ విప్లవాన్ని ఆధారం చేసుకుని శంకర్ రోబో 2.0 ని మలచారు.  కట్ చేస్తే...ఉన్నట్టుంది భూమ్మ్మీద మొబైల్ ఫోన్స్ మాయం అవుతూ వుంటాయి.  ఎదో ఒక అద్భుత శక్తి సెల్ ఫోన్లు అన్నింటిని హరించి...ఆకాసంలోకి లాక్కుని వెళ్తుంది..ఈ మొబైల్స్ అన్నింటిని ఒక పక్షి ఆకారం (అక్షయ్ కుమార్) తనలో ఇముడ్చుకుని నగరంలో చొరబడి విధ్వంసాన్ని సృష్టిస్తుంది...భూమ్యాకర్షణ శక్తిని మించిన అతి బలీయమైన శక్తీ ఎదో వుందని గ్రహిస్తారు...దాన్ని ఆపటానికి రోబో 2.౦....చిట్టి...రీలోడెడ్ ....ను రంగంలోకి దించుతాడు..మన వసీకర్...సూపర్ స్టార్ రజినీకాంత్.... అలా చిట్టి మళ్ళీ తన మేధస్సుతో ఎలా ఆ పక్షి రాజు ను ఎదుర్కొన్నాడు....ఆ పక్షిరాజు అసలు కథేంటి...తెలియాలంటే రోబో 2.౦ చూడాల్సిందే....

 

శంకర్ సినిమాల్లో ఒక సామాజిక నేపథ్యం ఎప్పుడు వుంటుంది....దాని ఆధారం గా ..టెక్నాలజీ ని వాడుకుని... గ్రాఫిక్స్ జోడించి..ఒక విజువల్ వండర్ గ తీర్చి దిద్దుతాడు...ఈ సారి మొబైల్ ఫోన్స్ ని టార్గెట్ చేసి...ప్రకృతికి మొబైల్స్ వాళ్ళ ఎంత విపత్తు కలుగుతోంది...వీటి వాళ్ళ భ'విష్యత్హులో ఎలాంటి విపత్తులకు దారి తీస్తుందో..కళ్ళకు కట్టినట్టు చూబించారు...సినిమా ప్రథమార్థం అంతా సెల్ ఫోన్లు మాయం అవటం,, పక్షి రాజు విన్యాసాలు...ఇవే ఎక్కువగా వున్నాయి...

 

సెకండ్ హాఫ్ లో పక్షి రాజు కథపై దృష్టి సారించారు శంకర్.    పక్షి రాజు ఎవరు...ఎందుకు ఇలా విధ్వసం సృష్టిస్తున్నాడు...అనే విషయాన్ని ఫ్లాష్ బ్యాక్ లో ఎమోషనల్ గా చూబించారు.. తర్వాత చిట్టి- పక్షి రాజుల పోరాటాలని గ్రాఫిక్స్ మాయజాలంతో అదుతంగా చేసాడు.  కొన్ని చోట్ల మనకు రోబో లో చుసిన సన్నీవేశాలనే మళ్ళీ చూస్తున్నామ అనిపిన్స్తుంది...  

 

సినిమా అంతా గ్రాఫిక్స్ మయా జాలమే...ఆఖరి 20 నిమిషాలు చిత్రంలో వచ్చే గ్రాఫిక్స్ హై లైట్ గా నిలుస్తాయి.

 

రజిని రోబో గా ఎప్పటిలాగే తన విన్యాసాలతో.. చమక్కులతో...డాన్స్ మూవ్ మెంట్స్ తో అలరించారు.. రోబో అంటే రజిని అన్నంట్టుగా నటించారు.. అక్షయ్ కుమార్ గెట్ అప్ అడిరిపోయింది.  సినిమా అంత ఎక్కువ అదే గెటప్ లో కనిపిస్తారు...అమీ జాక్ సన్ ... రజినీకాంత్ ...అక్షయ్ కుమార్ సినిమాల్లో ఒక ల్యాండ్ మార్క్ మూవీ గ మిగుల్తుంది.

 

ఈ చిత్రం ౩ D లో ఎఫెక్ట్స్ మరింత బాగున్నాయి... రెహమాన్ 4D బాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్ ని క్రియేట్ చేస్తుంది....సినిమా అంత కనులకు విందుగా ...భారీ హంగులతో..కనిపిస్తుంది..

 

ఈ సినిమా చివర్లో ఒక చమక్కు కూడా వుంది...డోంట్ మిస్ ఇట్. 

 

పాజిటివ్స్:

రజిని కాంత్  ఎలేక్రిఫియ్యింగ్ ఆక్షన్

అక్షయ్ కుమార్ విలనీ

గ్రాండ్ సెట్స్, ఫోటోగ్రఫీ

శంకర్ దర్శక మాయాజాలం, స్క్రీన్ ప్లే

రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మూజిక్            

ఇంటర్వెల్ లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు.

రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

 

వీక్ నెస్

మిస్ అయిన కామెడి

 

చివరగా...సినిమా ప్రారంభం లో వచ్చే టైటిల్ కార్డ్స్ మిస్ అవ్వొద్దు..

ఎంజాయ్ చిట్టి..   రేలోడేడ్.

 

రేటింగ్

4/5