Latest News

అదిరే ఫీచర్లతో హువావే మేట్‌ 20 ప్రో

చైనీస్ మొబైల్ దిగ్గజం హువావే భారత మార్కెట్లోకి ‘మేట్‌ 20 ప్రో’ ఫ్లాగ్షిప్ మోడల్‌ను భారత్‌లో ఈరోజు విడుదల చేసింది.  ఈ ఫోన్ వెనుకవైపు ౩ కెమెరాలతో, నాచ్ డిస్ప్లే తో వుండే ఈ ఫోన్ గ్రిప్ కోసం హైపర్ ఆప్టికల్ టెక్స్చర్ద్ బ్యాక్ పానెల్ ను బిగించారు.  మేట్ 20 ప్రో ఎమరాల్డ్ గ్రీన్, ట్విల్లైట్ కలర్ లోనూ లభిస్తుంది.  6.39 అంగుళాల కర్వుడ్ డిస్ప్లే, 6 జీబీ ర్యాం, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 4200 ఎం ఎ హెచ్ బాటరీ దీని ప్రత్యేకతలు.  మేట్ 20 ప్రో వెనుకవైపు ౩ కెమెరాలు 40, 20, 8 మెగా పిక్సెల్ కాగా, ముందువైపు 24 మెగా పిక్సెల్ కెమెరా వుంది.    ఈ ఫోన్ 15w ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.  అలాగే ప్రపంచంలోనే మొదటి సారిగా వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ సౌలభ్యం వుంది.  ఇన్ని ప్రత్యేకతలున్న మేట్ 20 ప్రో ను సొంతం చేసుకోవాలనుకుంటే డిసెంబర్ ౩ దాకా ఆగాల్సిందే.  అన్నట్టు ధర కూడా ఎక్కువే.. కేవలం రూ.  69990/- మాత్రమే.  హువవే మేట్ 20 ప్రో డిసెంబర్ ౩ నుంచి ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి, డిసెంబర్ 4 నించి సాధారణ సభ్యులకు ఆన్ లైన్ లో అమ్మకాలు ప్రారంభిస్తుంది.  మేట్ 20 ప్రో డిసెంబరు 10 నుంచి క్రోమా స్టోర్ల లో లభ్యం అవుతాయి.  ప్రారంభ ఆఫర్ గా ఈ ఫోన్ తోపాటు సెన్-హైజర్ హెడ్ ఫోన్స్ ను ఉచితంగా అందిస్తోంది.  దీంతో పాటు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ఆఫర్స్ కూడా అదనంగా పొందవచ్చు.