Skip to main content
Latest News

వృషణాల్లో వాపు కనిపిస్తే.. మగాళ్లూ అస్సలు నిర్లక్ష్యం వద్దు..

పురుష జననేంద్రియాలైన వృషణాల్లోనే వీర్య కణాలు తయారవుతాయని అందరికీ తెలిసిందే. ఈ వృషణాల్లో వాపు రావడానికి కారణాలు అనేకం. కారణాలు ఏమైనా ఒకసారి వృషణాల్లో వాపు రావడం మొదలయ్యిందీ అంటే ఇంక ఎంత మాత్రం నిర్లక్ష్యం కూడచేయదు. వైద్య చికిత్సలు లేకుండా ఎక్కువ కాలం అలాగే ఉంటే వృషణాలు పెద్దవై, మరికొన్ని ఇతర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. నిర్లక్ష్యం చేస్తే చివరకు సంతానలోపానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే సాధ్యమైనంత త్వరగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ వృషణా వాపులను తగ్గించేందుకు కొన్ని చిట్కాలను కూడా వైద్యులు కనిపెట్టారు. ఆ చిట్కాలు పాటించిన తర్వాత కూడా వృషణాల వాపు తగ్గకపోతే.. వైద్యులను సంప్రదించడం మేలు..

ములక్కాయల లోపలి గింజలు, ఆముదం గింజలు, ఆవాలు, జనుము గింజలు ముల్లంగి విత్తనాలను తీసుకుని వాటిలో పుల్లటి మజ్జిగను పోస్తూ నూరి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును వాపు ఉన్న చోట పట్టువేస్తే వృషణాల వాపు తగ్గుతుంది.

జిల్లెడు మొక్కల వేళ్లను నీటితో శుభ్రం చేసి గంజి కలుపుతూ దంచుకుని పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని వాపు పైన పట్టు వేయడంతో త్వరితంగా నొప్పి, వాపు తగ్గుతాయి.

మహిపాక్షి గుగ్గులను మట్టిలేకుండా శుభ్రం చేసి, కొంచెం ఆముదంతో బాగా నూరాలి. దీన్ని వాపు మీద రాస్తూ ఉంటే వాపు తగ్గుతుంది.

కాంచనాది గుగ్గులు, నిత్యానంద రసం, లోహ భస్మం.. ఈ మందులు కూడా వాపును బాగా తగ్గిస్తాయి.

మరిన్ని ఆరోగ్య చిట్కాలు  కొరకు మా హెల్త్-న్యూస్ పేజీ ని వీక్షించండి!

Health tips