Skip to main content
Latest News

కండోమ్స్ బదులు.. గర్భనిరోధక మాత్రలు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్..!

కొత్తగా పెళ్లయిన చాలామంది దంపతులు కొన్నిరోజులు ఎంజాయ్ చేయడానికి పిల్లలు వద్దనుకుంటారు. ఈ క్రమంలో గర్భం దాల్చకుండా ఉండడానికి మార్కెట్లో దొరికే గర్భనిరోధక మాత్రలు మింగుతుంటారు. కొందరయితే కండోమ్స్ వంటివి వాడుతుంటారు. అయితే అత్యధిక శాతం మంది మాత్రం గర్భనిరోధక మాత్రల వైపే మొగ్గుచూపుతుంటారు. కండోమ్‌తో సెక్స్ జరిపితే శాటిస్‌ఫాక్షన్ ఉండదంటూ మాత్రల వైపే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మాత్రలు వాడిన కొన్నిరోజుల ఎంజాయ్‌మెంట్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు కావాలనుకుంటే మాత్రం ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా మల్టిపుల్ సిరోసిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉందట. ఇటీవల ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడయింది. 

గర్భనిరోధక మందులు వాడేవారిలో ఎక్కువమందికి మల్టిపుల్ సిరోసిన్ అనే వ్యాధి వస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ మందులు కారణంగా నాడీవ్యవస్థలో నరాల మీద ఉండే రక్షణ పొర నాశనమై కండరాలు బలహీనంగా మారుతాయి. ఈ మాత్రలు ఎక్కువగా వాడిన మహిళల్లో ఎంఎస్ రిస్క్ 50 శాతం ఎక్కవగా ఉందని వెల్లడైంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే.. ఊబకాయం ఉన్న స్త్రీలలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం వారిలో ఆకలిని పెంచే హార్మోన్స్ ఎక్కువగా విడుదల కావడమే. కేంద్రియ నాడీవ్యవస్థలోని నరాల చుట్టూ రక్షణగా ఉండే మైలీన్ అనూ ఫైబర్ డామేజ్ అవడం వలనే. ఇలా అవ్వడం వల్ల శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ దానిమీద అదే దాడి చేసుకుంటుంది. ఫలితంగా శరీరం నెమ్మదిగా మొద్దుబారినట్టవుతుంది. కండరాలు బలహీనమవుతాయి. కంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు పెరిగాక వైకల్యం బారిన పడతారని స్పష్టం చేశారు. ఇంతకుముందు జంతువుల మీద జరిగిన పరిశోధనల్లో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు ఎంఎస్ రిస్క్‌ను తగ్గిస్తాయి. దానికి పూర్తి విరుద్ధంగా నాడీవ్యవస్థ మీద పనిచేసే కండరాల బలహీనతకు కారణమవుతుందని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. కనుక గర్భనిరోధక మందులు వాడడం మానేయండి. అవసరమైతే కండోమ్స్ వాడితే మెరుగైన ఫలితం ఉంటుంది.. ఏది ఏమైనా డాక్టర్ సలహా లేనిది ఇలా మాత్రలు వాడటం ఆరోగ్యానికే కాదు.. భవిష్యత్‌లో గర్భం దాల్చడానికి కూడా ప్రమాదం. 

మరిన్ని ఆరోగ్య చిట్కాలు  కొరకు మా హెల్త్-న్యూస్ పేజీ ని వీక్షించండి!

Health Tips