Skip to main content
Latest News

మగాళ్లూ.. సెక్స్ సామర్థ్యం తగ్గిందా..? శృంగారంలో రెచ్చిపోవాలంటే..

ప్రస్తుత కాలంలో చాలా మంది మగాళ్లలో శృంగార సామర్థ్యం తగ్గిపోతోంది. బెడ్‌రూమ్‌లో భాగస్వామిని సంతృప్తి పరచలేక ఇబ్బంది పడుతున్నారు. తమలో తామే కుమిలిపోతున్నారు. బయటకు చెప్పలేక.. అలా అని భార్య ముందు అవమానం భరించలేక ఆత్మహత్యలకు కూడా సిద్ధమవుతున్నారు. గతంలో ఇలాంటి సమస్యలు చాలా అరుదుగా ఉండేవి. కానీ మారుతున్న పరిస్థితుల వల్ల.. ఈ కాలంలో ఈ సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. మగాళ్లలో సెక్స్ సామర్ధ్యం తగ్గడానికి  శారీరక బలహీనతతో పాటు మానసిక ఒత్తిళ్లు, ఆహార అలవాట్లు వంటి ఎన్నో రకాల కారణాలున్నాయి. మరి వాటి నుంచి ఎలా బయపడాలో... శృంగారంలో మళ్లీ ఎలా రెచ్చిపోవాలో.. తెలుసుకోండి.. 

ఆహారం వ్యక్తి ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం శృంగార జీవితంలో ఇబ్బందులు తెస్తుంది.

ఎక్కువ శాతంలో బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల సెక్స్ సామర్ధ్యం తగ్గిపోతుంది.

అంతేకాదు ఎక్కువగా మందులు వాడేవారు సంభోగం సమయంలో త్వరగా నీరసించిపోతారని నిపుణులు చెబుతున్నారు

అతిగా మద్యం తాగడం, ప్రొగ తాగడం వల్ల కూడా సెక్స్ సామర్ధ్యం త్వరగా తగ్గిపోతుందని పలు అధ్యయనాల్లో తేలింది

ఎక్కువగా మందు, సిగరెట్లు తాగితే అవి పురుషునిలోని వీర్య కణాల్ని నాశనం చేస్తాయి.

Read Also : సెక్స్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. ఏం తినాలి..? ఏమేం తినకూడదంటే..!

ఆరోగ్యకరమైన శృంగార జీవితం కోసం జంక్ ఫుడ్‌, చెడు వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండాలి

వెల్లుల్లి తినడం వల్ల ఆడవారు, మగవారిలోనూ లైంగిక వాంఛ పెరుగుతుందని నిర్ధారణ అయింది.

ధనియాల పొడిని నీటిలో కలిపి కాసింత పసుపు వేసి తాగడం వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయి.

వ్యాయామం చేయటం వల్ల పురుషుల్లో రక్త ప్రసరణ బాగా జరిగి చక్కటి శక్తి సామర్ధ్యాలు మీరు పొందుతారు.

ఎక్కువ మంది పురుషులు తమ భాగస్వాముల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుంటారు. ఇది మంచిది కాదు.

లైఫ్ పార్ట్‌నర్‌ని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం కుటుంబ జీవితంతో పాటు శృంగారం జీవితంపైనా ప్రభావం చూపుతుంది.

భార్యతో గొడవ పడితే సాధారణంగానే ఆందోళన, ఒత్తిడి పెరిగి శీఘ్రస్కలన సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది.

పాలకూర తినడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.. దీంతో పాటు కోరికలు పెరుగుతాయి.

డీ విటమిన్ తగ్గడంలో కోరికలు తగ్గుతాయి. కాబట్టి డీ విటమిన్ కలిగిన పుట్టగొడుగులు, కార్న్ ఫ్లేక్స్ తీసుకోవాలి. గుడ్లు, తృణధాన్యాలు తీసుకోవడం సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.

అందుకే ఆందోళన, ఒత్తిడి, కంగారు తగ్గించి క్రమశిక్షణతో కూడిన అలవాట్లను అనుసరిస్తే భార్యను సంతృప్తి పరచగలరు.

మరిన్ని ఆరోగ్య చిట్కాలు  కొరకు మా హెల్త్-న్యూస్ పేజీ ని వీక్షించండి!

Health Tips