Skip to main content
Latest News

పనస పండుతో ఇన్ని లాభాలా..? మగాళ్లు తెలుసుకోవాల్సిందే..

ఎంతో రుచి గల పనసపండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులోని ఎన్నో పోషక విలువలు మనకి అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అవేంటో ఓ లుక్కేయండి..

పనసపండ్లలో విటమిన్ ఎ, సి, బి6 మాత్రమే కాక, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ ఉంటాయి..

ఈ పండ్లలోని కొన్ని ప్రత్యేక గుణాలు కాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడుతాయి. ప్రేగు, లంగ్ కాన్సర్‌కు కారణమయ్యే కారకాలతో పోరాడడంలో ఈ పండు సహాయపడుతుంది.

జీర్ణ సంబంధిత సమస్యలను అధిగమించడంలో పనసపండు చక్కగా ప్రయోజనం కలిగిస్తుంది.

పనసతొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల మగవారు శృంగారంలో రెచ్చిపోతారని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండు తినడం వల్ల ఇన్సులిన్ తీసుకున్నంత ప్రయోజనం కలుగుతుంది.

ఇందులోని విటమిన్ A కంటిచూపుని మెరుగుపరచడమే కాక, చర్మం, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది.

పనస పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది. మహిళలకు ఎంతో ప్రయోజనకరం.

ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంలో ఈ పండు మేలైనదిగా చెప్పొచ్చు.

మరిన్ని ఆరోగ్య చిట్కాలు  కొరకు మా హెల్త్-న్యూస్ పేజీ ని వీక్షించండి!

Health Tips