Skip to main content
Latest News

సెక్స్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. ఏం తినాలి..? ఏమేం తినకూడదంటే..!

లైంగిక సామర్థ్యం తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని పరిశోధకులు బల్లగుద్ది చెబుతున్నారు. శృంగారం విషయంలో ఏమైనా తేడా కనిపిస్తున్నట్లయితే వెంటనే ఆహారం విషయంలో మార్పులు చేసుకోండి. లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలలో తులసి, లవంగం, టమాట, ముల్లంగి, కోడిగుడ్డు, క్యారట్‌, పిల్లితీగలు, అల్లం, ఉల్లి, దోసకాయ, ఎర్రమిరియాలు, ఓట్లు, పిస్తా, చెస్ట్‌నట్‌, హాజల్‌నట్‌, కొబ్బరి, పుట్టగొడుగు ముఖ్యమైనవి. ముఖ్యంగా విటమిన్‌ ఇ ఉండే బాదం, వాల్‌నట్‌లు లైంగిక సామర్థ్యం పెరగడంలో అద్భుతంగా ఉపయోగపడుతాయంటున్నారు. ఎరుపు రంగులో ఉండే పదార్థాలు, డ్రింక్స్‌ తీసుకుంటే లైంగిక సామర్థ్యం వృద్ధి చెందుతుందని అంటున్నారు. లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్న వారు ప్రతి రోజు మంచి ఆహారంతో పాటు విటమిన్‌ ఇ కాప్యుల్స్‌ను కూడా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సెక్స్‌ జీవితం ఆనందంగా ఉండాలంటే.. ఏమేం తినాలో తెలుసుకోవడం కంటే.. ఏమేం తినకూడదనేదానిపై ఓ అవగాహన ఉండటం చాలా అవసరం. ఓ ఆహార పదార్థంగా సోయా, మాంసాహారం కంటే మంచిదే. అయితే, సెక్స్‌ జీవితానికి మాత్రం ఇది ఏ విధంగానూ మంచిది కాదట. ఇందులో ఉండే ఫైటోఎస్ర్టోజెన్‌ మూలకం పురుషుల్లోని సెక్స్‌ హార్మోన్లను దెబ్బ తీస్తాయి. ఇది పుంసత్వాన్ని బలహానపరచడమే కాక, పునరుత్పత్తి సత్తాను కూడా గణనీయంగా తగ్గించేస్తుంది. సోయాను తరచూ తినడం వల్ల పురుషుల్లో సెక్స్‌ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలింది కూడా.. ఇక తరచూ సోడాలు తాగడం వల్ల, శీతల పానీయాలు తాగడం వల్ల కూడా సెక్స్‌ పటుత్వం దెబ్బ తింటుంది. ఇవి శరీరంలోనే కాక, మూడ్‌లో కూడా హెచ్చుతగ్గుల్ని కలిగిస్తుంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశిస్తే ఆరోగ్యం పక్కదారి పట్టి సెక్స్‌ జీవితం క్షీణించడం ప్రారంభిస్తుంది. నోరు తియ్యగా ఉండడమే కాకుండా, సువాసనలు వెదజల్లడానికి నోట్లో వేసుకుని చప్పరించే కొన్ని రకాల బిళ్లలు, స్వీట్లు శరీరానికి తీరని హాని కలిగిస్తాయని, వాటి వల్ల సెక్స్‌ పటుత్వానికి కూడా ప్రమాదం ముంచుకొస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. వీటితోపాటు చిప్స్, పిజ్జా, కొవ్వు పదార్థాలు, వేపుళ్లు, అధికంగా కాఫీ తాగడం, ఛీజ్, మొక్కజొన్న పొత్తులు, పాప్‌కార్న్, కార్న్ ప్లేక్స్ వంటి వాటిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచితేనే సెక్స్‌లైఫ్‌ను ఎంజాయ్ చేయగలరు.. 

మరిన్ని ఆరోగ్య చిట్కాలు  కొరకు మా హెల్త్-న్యూస్ పేజీ ని వీక్షించండి!

Health Tips