Skip to main content
Latest News

తొలిసారి శృంగారంలో పాల్గొనేవాళ్లు.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!

శృంగారం అనేది ఒక కళ.. ఫోర్ ప్లే నుంచి సంభోగం చేసే వరకు ప్రతి సందర్భమూ హాయిగా, ఆనందంగా ఆస్వాదించదగినదే. అది కలిగించే అనుభూతి అత్యంత మధురమైనది. ఈ సృష్టి కార్యం స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని వెయ్యి రెట్లు ఎక్కువ చేయగలదు. సంభోగం ఒక్కటే సెక్స్ అనుకుంటే అంతకుమించిన తప్పు మరొకటి ఉండదు. అందుకే పడకగదిలోకి వెళ్లేముందే సెక్స్‌కు సంబంధించిన విషయాలు కొన్నైనా తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా తొలిసారి సెక్స్‌లో పాల్గొనేవారు చాలా తప్పులు చేస్తుంటారు. మనం పెరిగిన పరిస్థితులు, సంస్కృతి వల్ల సెక్స్‌పై అవగాహన లేకపోవడం.. తద్వారా తప్పులు జరగడం సహజమే. అందుకే తొలిసారి శృంగారంలో పాల్గొనబోయే ముందు కొన్ని కీలక విషయాలు తెలుసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

తొలిసారి సెక్స్‌లో పాల్గొనబోయే వ్యక్తులు.. తొలిరాత్రి అనుభూతుల గురించి ఎవరో చెప్పినవి విని, వారికి జరిగినట్లే మనకూ జరుగుతుందనుకోవడం తప్పు. వీలైనంత వరకు ఆ మాటల్ని మర్చిపోతేనే మేలు. మీడియాలోనో, సమాజంలోనో ఎవరో ఒకరు తొలి సెక్స్ గురించి చెబుతూ ఉంటారు. వాటిని పట్టించుకోవద్దు. తొలిసారి అనుభవించే సెక్స్ అంత సక్సెస్ ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు కుంగిపోవడం. మొదటిసారి అలా జరగడం సహజమే. 

తొలిసారి ఏ రకం సెక్స్‌ను కోరుకుంటున్నారనేది కూడా కీలకం. తొలిసారి ఓరల్ సెక్స్ చేయాలని కోరుకుంటున్నారా? నగ్నంగా ఉండాలని కోరుకుంటున్నారా? సంభోగం చేయాలనుకుంటున్నారా? లేక అన్ని ప్రక్రియలను ఆస్వాదించానుకుంటున్నారా? అనే దానిపై కొంతైనా స్పష్టత ఉండాలి. ఇక్కడ.. లక్ష్యాన్ని పూర్తి చేశామా? లేదా? అన్నది చూడకూడదు.

శరీరంలో ఎక్కడ తాకితే బాగా అనిపిస్తుంది.. తదితర విషయాలు మనకు మనం తెలుసుకోగలిగితే మంచిది. అత్యంత కీలకమైనది ఏంటంటే.. భాగస్వామి. సెక్స్‌లో పాల్గొనబోయే భాగస్వామితో సేఫ్‌గా, సౌకర్యవంతంగా ఉంటామా? అనేది చూసుకోవాలి. సౌకర్యవంతంగా ఉంటే శృంగారాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేసే అవకాశాలుంటాయి. అదే, సేఫ్టీ, కంఫర్ట్ లేకపోతే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. ఆతృతతో ఏ పని చేయకూడదు. 

సురక్షితమైన శృంగారం చాలా ముఖ్యం. ఓరల్ సెక్స్ చేసేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ రాకుండా ముందుగా జననాంగాలను శుభ్రం చేసుకోవాలి. కండోమ్స్, బర్త్ పిల్స్ వంటివి వాడకాన్ని గుర్తుంచుకోవాలి. సేఫ్ సెక్స్ గురించి మాట్లాడటం గురించి ఎలాంటి దాపరికం ఉండకూడదు. క్షణం పాటు సుఖం కోసం రోగాల బారిన పడవద్దు.

ఫోర్ ప్లేపై ఎక్కువగా దృష్టి సారించాలి. చుంబనాలు, ఇరువురు టచ్ చేసుకోవడం లాంటివి చేయాలి. దానివల్ల సెక్స్‌ కోరికలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. అలా చేయడం వల్ల స్త్రీల జననాంగాల్లో సహజంగానే ల్యూబ్రికేషన్ పుడుతుంది. ఆ తర్వాత.. సంభోగం జరిపే సమయంలో గాయాలు కాకుండా ఉండేందుకు ఆయిల్ వంటి జారుడు గుణం ఉండే వాటిని వాడటం చాలా మంచిది. 

చివరగా.. సెక్స్ చేసే సమయంలో శరీరం ఇక్కడ.. మనసు ఎక్కడో అన్నట్లు ఉండకూడదు. దాని వల్ల సెక్స్‌ను ఆనందంగా అనుభవించలేరు. సెక్స్ పొజిషన్స్‌పైనా ఫోకస్ పెడితే మీ ఆనందానికి అవధులు ఉండవు.

మరిన్ని ఆరోగ్య చిట్కాలు  కొరకు మా హెల్త్-న్యూస్ పేజీ ని వీక్షించండి!

Health Tips