Skip to main content
Latest News

శృంగారానికి ముందు దీన్ని తింటే.. ఇక అంతే సంగతులు..!

చాలా మంది శృంగారం చేసే ముందు ఏదో ఒకటి గబుక్కున తినేసి పడక గదిలో ప్రతాపం చూపించేందుకు సిద్ధమైపోతుంటారు. అయితే నిపణులు మాత్రం తినే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బాగా కొవ్వు ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని డైటీషియన్లు సూచిస్తున్నారు. తక్షణ శక్తి కొరకు కొందరు అడ్డదిడ్డంగా పిజ్జాలు, బర్గర్లు కానిచ్చేస్తుంటారు. అయితే శృంగారం చేసే ముందు పిజ్జా లాంటి హెవీ డైట్ తీసుకుంటే రాత్రంతా కునుకు పాట్లు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

శృంగార జీవితంపై పిజ్జా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శృంగారంలో సంతృప్తి కలుగకపోతే.. జంక్ ఫుడ్ తినడం పూర్తిగా మానేయాలని సెక్సాలజిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే పిజ్జా కోసం ఉపయోగించే బేస్‌ను మైదాపిండితో చేస్తారు. మైదాపిండి శృంగార భావాలను తగ్గిస్తుంది. నిద్రను రప్పిస్తుంది. రాత్రిపూట పిజ్జాలు తినడం ద్వారా అజీర్తికి కారణమవుతుంది. హార్మోన్ల నియంత్రించడంతో లైంగిక జీవితం నిస్సారంగా మారుతుంది.

అందుకే రాత్రి పూట శృంగారానికి ముందు పిజ్జాలు తినడం, శీతలపానీయాలు తాగడం చేయకూడదని.. పిజ్జాల తినడం ద్వారా కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. ఇవి శృంగారానికి అడ్డుగా మారుతాయి. శీతల పానీయాలకు బదులు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. పిజ్జాలను శృంగారానికి ముందు తినకపోవడం చాలా మంచిది. అలాగే మసాలా పదార్థాలు తినకూడదు. తినాలనిపిస్తే పాస్తాను సాస్‌తో ఎంచుకోవచ్చు. ఇందులో వెల్లుల్లి, చీస్ లేకుండా చూసుకోవడం మంచిది. రాత్రిపూట వెల్లుల్లి, ఉల్లి తినకూడదు. బీన్స్ తినడం మానేయాలి. బీన్స్‌లో చక్కెర శాతం అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణం కావు. ఇవి కడుపు నొప్పికి కారణమవుతాయి.

మరిన్ని ఆరోగ్య చిట్కాలు  కొరకు మా హెల్త్-న్యూస్ పేజీ ని వీక్షించండి!

Health Tips