Skip to main content
Latest News

పోలీస్ సేవల్లో గ్రేడింగ్

విద్యార్థులకు పరీక్షలల్లో గ్రేడింగ్ ఇవ్వడం తెలుసు. కళాశాలలకు సామర్థ్యాన్ని బట్టి గ్రేడింగ్ ఇవ్వడం తెలుసు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని మరింత విస్తృతం చేయాలని, సేవల్లో పారదర్శకతను పెంచాలనే లక్ష్యంతో పోలీసు శాఖ గ్రేడింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో అమలవుతూ సత్పలితం ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది. దీంతో పోలీస్ ఉన్నాతధికారులు, సిబ్బందిలో జవాబుదారీ తనం పెరిగి ప్రజలకు నాణ్యమైన సేవలు అందే అవకాశం ఉంది.పోలీస్ స్టేషన్‌లోవివిధ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఫిర్యాదుదారులతో పాటు వారి సెల్ నంబర్ తీసుకుంటారు.

ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఫిర్యాదుదారుని పూర్తి వివరాలను సంబంధింత పోలీసు అధికారులు ఫీడ్‌బ్యాక్ కేంద్రానికి అందజేస్తారు. కేసులో చేపట్టిన విచారణ, సాధించిన ప్రగతి, తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ సిబ్బంది ఫిర్యాదుదారునితో నేరుగా ఫోన్‌లో మాట్లాడటం, కేసు విచారణలో పురోగతి, సేవలు ఎలా అందుతున్నాయనే వివరాలు నమోదు చేస్తారు. పోలీస్‌స్టేషన్‌లో అందుబాటులో ఉన్న సేవలు, సిబ్బంది ప్రవర్తనను సైతం తెలుసుకుంటారు.

పనితీరును గుర్తించేందుకు..
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల పనితీరు సక్రమంగా నిర్వహించేలా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే పోలీస్ శాఖ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్త్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్‌కు వాహన సౌకర్యం స్టేషనరీనిధులు అందజేస్తుంది. కానీ సేవల విషయంలో ప్రజలు అసంతృప్తికి గురికాకుండా పరిస్థితుల్లో మార్పు తీసుకోచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. . కిందిస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరి ప్రవర్తన, పనితీరు నేరుగా ప్రజల నుంచి తెలుసుకోన్ని ఫీడ్‌భ్యాక్ కేంద్రానికి వివరాలు పంపిస్తారు. పనితీరు బాగాలేని వారికి సూచనలు, సలహాలు ఇస్తారు. 

జిల్లాలలో త్వరలో ప్రారంభం...
పోలీసులకు గ్రేడింగ్ నిర్ణయించే విధానం రాష్ట్రంలోని పలు జిల్లాలలో నూతన సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి మార్గదర్శకాలు రాగానే జిల్లాలో ప్రారంభించనున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ విధానం అమలైతే పోలీసుల్లో జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. ప్రజానీకానికి పారదర్శకమైన సేవలు అందుతాయి.