Skip to main content
Latest News

నిద్రపోతున్న మహిళపై రేప్.. ఆమెకు అస్సలు మెలకువ రాలేదట..!

విదేశాల నుంచి ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిందో జంట.. ప్రఖ్యాత ప్రదేశాలన్నీ తిరిగి తిరిగి... తిరిగి.. బాగా అలసిపోయారు.. ఇంక చాలు అనుకుని తాము బస చేసిన హోటల్‌కు తిరిగొద్దామని చూస్తే.. అప్పటికే సమయం చాలా మించిపోయింది. తాము ఉన్న ప్రాంతానికి.. ఆ హోటల్‌కు వెళ్లేందుకు ఈ సమయంలో వాహన సదుపాయం ఏమీ లేదని తెలియడంతో నిరాశకు గురయ్యారు.. సరే ఏది జరిగితే అదేలే అనుకుని దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్లో భోజనం చేశారు. ఆ తర్వాత ఆ రెస్టారెంట్‌కు ముందు ఉన్న ఖాళీ స్థలంలో నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటాక ఆ రెస్టారెంట్‌ను కూడా మూసేశారు. తెల్లారి చూసే సరికి ఆ దంపతులకు షాక్.. భార్య ఒంటి మీద దుస్తులన్నీ పీలికలుగా మారిపోయాయి. ఆమెపై లైంగిక దాడి జరిగిందని ఆమె ఆలస్యంగా గ్రహించింది. అసలు ఇది ఎలా జరిగింది..? తనకు ఏమాత్రం తెలయలేదేంటా..? అని ఆమె వాపోతూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని.. రెస్టారెంట్ సీసీ కెమెరాలను పరిశీలిస్తే షాకింగ్ సీన్ కనిపించింది. ఆమె స్థితికి కారణమేంటో బయటపడింది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ ఘటన.. సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. తనపై అత్యాచారం చేస్తున్నా.. సోయి లేకుండా ఎలా పడుకునిపోయిందోనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

థాయ్‌లాండ్ అందాలను చూసేందుకు ఓ బ్రిటన్ దంపతులు వచ్చారు.. ఇక్కడి కో ఫిఫి దీవుల్లో పగలంతా పర్యటించి, అక్కడి అందాలను ఆస్వాదించారు. చీకటిపడిపోవడంతో వారు దిగిన హోటల్‌కు తిరిగివెళ్లడం కుదరలేదు. దీంతో దగ్గరలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేశారు. ఆ తర్వాత రెస్టారెంట్ ముందు ఉన్న ఖాళీ స్థలంలో నిద్రకు ఉఫక్రమించారు. బాగా ప్రయాణాలు చేయడం.. రోజంతా తిరుగుతూనే ఉండటంతో వారిద్దరికీ నిద్ర వెంటనే వచ్చేసింది. ఘాడ నిద్రలోకి వెళ్లిపోయారు. వాళ్లిద్దరూ నిద్రపోయిన కాసేపటికి అటుగా వచ్చాడో స్థానిక యువకుడు. రోడ్డు పక్కనే పడుకొని ఉన్న దంపతుల్లో ఆ అందమైన అమ్మాయిని చూడగానే అతనికి పిచ్చి ఆలోచనలు కలిగాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో.. తన వద్ద ఉన్న కత్తెరతో ఆమె దుస్తులన్నీ కత్తిరించేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఎంచక్కా వెళ్లిపోయాడు. ఇదంతా దగ్గరలోని ఓ సీసీకెమెరాలో రికార్డయింది. ఉదయం లేవగానే తనున్న పరిస్థితిని చూసుకున్న ఆ మహిళ వెంటనే పోలీసులను సంప్రదించింది. అక్కడి సీసీకెమెరాను పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.