Latest News

బతుకమ్మ చీరలు కెసిఆర్ కూతురు కట్టుకుంటుందా?? సినీనటి ఖుష్బూ

ఒక మహిళకు మంత్రి పదవి ఇవ్వలేని కెసిఆర్ కు మహిళా సంక్షేమం గురించి మాట్లాడే హక్కు లేదని సినీ నటి ఖుష్బూ అన్నారు.  ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాత తరఫున ఎన్నికల ప్రచారంలో మంగళవారం పాల్గొన్నారు.  బతుకమ్మ చీరాల కొనుగోళ్లల రూ. 225 కోట్ల మేర అవినీతి జరిగిందనీ ఖుష్బూ ఆరోపించారు.  బతుకమ్మ చీరల పేరిట సీఎం కేసీఆర్‌ పంపిణీ చేసిన చీరలు ఆయన కూతురు కట్టుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు.  మంత్రివర్గంలో మహిళ లేని రాష్ట్రం ఒక్క తెలంగాణే అనీ, మహిళకు మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్‌కు మహిళా సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ తెరాస అభ్యర్థి జోగురామన్న జోకుడు రామన్నగా మారారని, తెలంగాణలో నియంత పాలనను చరమగీతం పాడాలనీ ఆయన పిలుపునిచ్చారు. ఈ రోడ్‌ షోలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌కృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.