Latest News

పోలవరం సందర్శనకు బయలుదేరిన...జనసేన అధినేత

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరారు. అక్కడ జరుగుతున్న ప్రాజెక్టు పనులను పవన్‌ పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పనుల గురించి ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రాజమహేంద్రవరం రివర్‌బేలో జనసేన సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు.ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవల జనసేన పార్టీలో పేర్లు నమోదుచేసుకున్న కార్యకర్తలు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొంటారు. పవన్‌ను చూసేందుకు రివర్‌ బే హోటల్‌కు భారీసంఖ్యలో అభిమానులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.