Skip to main content
Latest News

పెళ్లైన 16 ఏళ్ల తర్వాత భర్తకు కోలుకోలేని షాకిచ్చిన భార్య.. 

వారిద్దరికి పెళ్లయి 16 ఏళ్లవుతోంది. ఇద్దరు పిల్లలు. ఏనాడూ ఆ భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవ రాలేదు.. కుటుంబ కలహాలు కూడా లేవు.. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. కానీ ఊహించని రీతిలో భర్తకు ఆ భార్య షాకిచ్చింది. ఏనాడూ భార్య ప్రవర్తనపై ఆ భర్తకు అనుమానం రాలేదు.. కానీ ఆ భార్య మాత్రం భర్తను కోలుకోలేని దెబ్బ తీసింది. ఉన్నట్టుండి ఇంట్లోంచి మాయమయింది. అంతే కాదు ఇంట్లో నుంచి దాదాపు రూ.5 లక్షలు విలువ చేసే డబ్బు, నగలతో పాటు ఎస్కేప్ అయింది. అసలు దీనికి కారణం ఏమయి ఉంటుందో తెలీక ఆ భర్త సతమతమవుతున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరుతున్నాడు. చిత్తూరు జిల్లాలోని తొండగి మండలం వేమవరం గ్రామంలో జరిగిందీ వింత ఘటన. 

వేమవరం గ్రామానికి చెందిన పారుపల్లి నాగేశ్వరరావు.. తునికి చెందిన లావణ్యకు 16 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. వీరి అన్యోన్య దాంపత్యాన్ని చూసి చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. ఏనాడూ వీరిద్దరూ గొడవ పడిన దాఖలాలు లేవు. అయితే ఈ నెల 8న భార్య లావణ్య ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు 10 తులాల నగలు, రూ.53 వేల నగదును తీసుకుని ఇంటి నుంచి పరారైంది. ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు అన్నీ సర్దుకుంటున్న సమయంలో బయట నుంచి వచ్చిన భర్త ఇంట్లోకి వెళ్లి బీరువా తీసి నగదు కనబడకపోయే సరికి బయట ఉన్న భార్యను పిలిచి డబ్బు ఏంచేశావంటూ కేకవేశాడు. అప్పటికే లావణ్య అలా..అలా..బయటకు నడిచి వెళ్లిపోయి కనబడకుండా ఎటో జారుకుంది. తెలిసిన అన్ని చోట్లా వెతికారు. కనబడలేదు. ఈలోగా ఇంట్లో ఉన్న నగలను కూడా అనుమానం వచ్చి పరిశీలించగా నకిలీవని తేలింది. బంగారు నగల స్థానే వాటిని పెట్టి వెళ్లిపోయిందని గుర్తించిన కుటుంబసభ్యులు హతాశులయ్యారు. వెంటనే తొండంగి పోలీసులకు ఫిర్యాదుచేయగా ఏఎస్‌ఐ ఆంజనేయులు కేసు నమోదు చేశారు. ఆమె ఫోన్‌కాల్ రికార్డులను తీస్తున్నారు. ఏదైనా వివాహేతర సంబంధమే దీనికి కారణమయి ఉంటుందని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. 

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories Telugu