Skip to main content
Latest News

ఆత్మహత్యకు సిద్ధమై.. అనాథ శవంలా మిగలకూడదని.. అంత్యక్రియల కోసం విరాళం..

అతనో అనాథ.. ఒంటరి జీవితంపై విరక్తి పుట్టి చనిపోవాలనుకున్నాడు. కానీ తాను చనిపోతే..తన శవాన్ని పట్టించుకునేవారు కూడా ఉండరని ఆలోచించాడు. ఇందుకోసం ముందుగానే అంత్యక్రియలకు ప్లాన్ చేసుకున్నాడు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించే 'సర్వ్ నీడీ' అనే స్వచ్చంద సంస్థకు రూ.6వేలు ఇచ్చాడు.ఆ విరాళం అందుకున్న సమయంలో ఆ స్వచ్చంద సంస్థకు అతని మనసులో ఏముందో తెలియదు. అందరి లాగే అతనూ విరాళం అందిస్తున్నాడని అనుకున్నారు. కానీ ఆ విరాళం అందుకున్న రెండు రోజులకే అతను చనిపోయినట్టు తెలిసింది. దీంతో అతనిచ్చిన డబ్బుతో అతడి అంత్యక్రియలను నిర్వహించారు.

Read Also : నువ్వొప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటానంటూ అమృతకు లేఖ

వివరాల్లోకి వెళ్తే..  వివరాల్లోకి వెళ్తే...  నిజామాబాద్‌ జిల్లా గాంధీనగర్‌ తండాకు చెందిన బొంతు విజయ్‌(26) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. డిగ్రీ చదివిన విజయ్‌ ఎనిమిదేళ్ళ క్రితం హైదరాబాద్‌కు వచ్చి శ్రీకృష్ణానగర్‌లో గది అద్దెకు తీసుకొని ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తనకంటూ ఎవరూ లేకపోవడంతో చాలా కుంగిపోయేవాడు. ఇదే క్రమంలో జీవితంపై విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే తాను చనిపోతే.. అనాథ శవమని ఎవరూ పట్టించుకోని పరిస్థితి రాకూడదనుకున్నాడు. గత కొంత కాలంగా తనకు ఎవరూ లేరని మానసికంగా మరింత కుంగిపోయాడు. గతంలో ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ఉండరని భావించిన విజయ్‌ ఓ నిర్ణయానికి వచ్చాడు. 

Also Read :  విశాఖలో దారుణం.. ఊరి నడిబొడ్డున్న అతడిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు..!

అనాథ శవాలకు అంత్యక్రియలను నిర్వహించే 'సర్వ్ నీడి' అనే స్వచ్చంద సంస్థకు సెప్టెంబర్ 22న రూ.6వేలు విరాళంగా చెల్లించాడు. ఆ స్వచ్ఛంద సంస్థను సంప్రదించి మీ సంస్థ చేస్తున్న సేవ నచ్చిందని రూ.6 వేల విరాళం అందజేసి ఎవరైనా అనాథకు ఈ విరాళంగా అంత్యక్రియలు చేయాలని కోరాడు. ఆ తర్వాత రెండు రోజులకే అతను మంగళవారం రాత్రి బేగంపేట రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. దాన్ని పరిశీలించగా.. 'నాకు జీవితంపై విరక్తి పుట్టింది. నా చావుకు ఎవరు బాధ్యులు కారు. నేను చనిపోతే ఎవరూ బాధపడవద్దు. నా అంత్యక్రియలను సర్వ్ నీడీ అనే సంస్థతో చేయించండి. నా మృతి వార్తను పెద్దమ్మ కుమారుడైన సందీప్‌కు చెప్పండి.' అంటూ అందులో పేర్కొన్నాడు. విజయ్ చెప్పిన మేరకు సర్వ్ నీడి సంస్థ ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. తన చావు వల్ల ఎవరూ ఇబ్బందిపడకూడదనే సర్వ్ నీడీ సంస్థకు అతను రూ.6వేలు విరాళం అందించాడు. అదే డబ్బు అతని అంత్యక్రియలకు ఉపయోగపడింది. 

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories Telugu