Skip to main content
Latest News

డిగ్రీ యువతి.. పెళ్లి కాకుండానే గర్భం.. అబార్షన్‌కు ప్రయత్నించి ఘోరం.. 

తల్లిదండ్రులకు దూరంగా.. సిటీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న యువతిని ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. మాయమాటలు చెప్పాడు. సినిమాలు, షికార్లంటూ తిప్పాడు. అతడి ప్రేమను చూసి ఆమె నమ్మింది. తనను తాను అర్పించుకుంది. చివరకు గర్భవతి అయింది. ఆ విషయం ఆమెకు చాలా ఆలస్యంగా తెలిసింది. దీంతో తాను గర్భవతినన్న విషయాన్ని ప్రియుడికి చెప్పింది. ఇంకా చదువు పూర్తవలేదు.. ఇలా గర్భం అంటే పరువుపోతుంది. ఇంట్లో వాళ్లు గొడవ చేస్తారు. మనం మంచిగ చదువుకుని జాబ్‌ వచ్చాకే పెళ్లి చేసుకుందాం. ప్రస్తుతానికి ఈ గర్భాన్ని తీసేద్దాం.. అంటూ ఆమెకు మాయమాటలు చెప్పి ఒప్పించాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించబోయాడు. చివరకు వైద్యం వికటించి.. నెలలు నిండని శిశువుతోపాటు ఆమె దుర్మరణం పాలయింది. ఈ విషయం తెలిసిన ప్రియుడు.. ఆమెను ఓ కారు డిక్కీలో పెట్టుకుని.. రాష్ట్రాలు దాటి మరీ.. వచ్చి.. ఓ నగర శివార్లలో పొదల్లో పడేసి.. పెట్రోలు పోసి కాల్చి చంపాడు. ఎంచక్కా తిరిగి వెళ్లిపోయాడు. కానీ చేసిన తప్పు దాగదన్నట్లు అతడి పాపం బయటపడింది. హైదరాబాద్ పరిథిలో జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివీ..

కర్ణాటకకు చెందిన జయ ప్రభు శ్యామూల్‌ కూతురు ఎస్తేర్‌ రాణి(23) గుల్బర్గాలోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండేది. ఆమెను ఓ యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించి వంచించడంతో గర్భవతి అయ్యింది. విషయం ఇంట్లో తెలుస్తుందని భావించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించేందుకు యత్నించారు. అబార్షన్‌ వికటించడంతో యువతి మృతి చెందింది. ఆమెతో పాటు శిశువు మృతదేహాన్ని ప్రియుడు ఓ కారులో తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లా పరిగి మండల పరిధిలోని రంగంపల్లి శివారులో హైదరాబాద్‌–బీజాపూర్‌ రహదారి పక్కన పడేశాడు. మృతదేహాలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. నిందుతుడికి అతని స్నేహితులు కూడా సహకరించారు. గుర్తు తెలీని మహిళ, ఓ శిశువు మృతదేహాలు కాలిపోయి ఉన్నాయని తెలుసుకున్న పరిగి పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

మిస్సింగ్‌ కేసులు, సీసీ పుటేజీల సాయంతో విచారణ ప్రారంభించారు. గర్భిణి మృతి వివరాలు పక్క జిల్లాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రానికి కూడా అందజేశారు. ఘటన జరిగిన రోజే కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో ఓ మిస్సింగ్‌ కేసు నమోదయ్యింది. పరిగి పోలీసుల వివరాలతో అక్కడి పోలీసులు సరిచూసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బ్రహ్మాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ తమ మిస్సింగ్‌ కేసుతో ఇక్కడి వివరాలు చూసుకొని తమ ఠాణా పరిధిలోని కనిపించకుండా పోయిన యువతిగా గుర్తించారు. పరిగి పోలీసుల నుంచి సమాచారం అందుకున్న కర్ణాటక పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగు చూసింది. దీంతో కేసును కర్ణాటక గల్బర్గాలోని బ్రహ్మాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్లు డీఎస్పీ రవీంద్రారెడ్డి వెల్లడించారు. 

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories Telugu