Skip to main content
Latest News

ప్రియుడితో పెళ్లికి రెండేళ్లు ఆగలేను.. సారీ డాడీ.. సారీ మమ్మీ..

రెండేళ్లు ఆగితే ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ ఆ బాలిక వినిపించుకోలేదు. ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాల్సిందేనంటూ పట్టుబట్టింది. పెద్దలు ససేమిరా అనడంతో తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. గత కొంతకాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉన్న బాలిక.. విషయం తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేయమని కోరింది. దీనికి సరేనన్న తల్లిదండ్రులు మైనర్ కావడంతో మరో రెండేళ్లు ఆగాలని సూచించారు. ఈ లోపు చదువు పూర్తిచేయమని చెప్పారు. అయితే రెండేళ్లపాటు వేచిచూస్తే.. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో..? తన తల్లిదండ్రులు మళ్లీ మాట మార్చుతారేమో.. తన ప్రియుడు తనకు దక్కడేమో అని ఆ బాలిక భావించింది.

Read Also : ఆత్మహత్యకు సిద్ధమై.. అనాథ శవంలా మిగలకూడదని.. అంత్యక్రియల కోసం విరాళం..

తల్లిదండ్రుల మాటలను కాదని, ఈ నెల 20న మధ్యవర్తి ద్వారా ఓ ఖాజీని కలిసి విషయం చెప్పి పెళ్లి చేయమని కోరింది. అతడు కూడా బాలిక తల్లిదండ్రులు చెప్పినట్టుగానే మైనర్ కాబట్టి తానా పని చేయలేనని, రెండేళ్లు ఆగాలని హితవు పలికాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టమని, ప్రేమించిన యువకుడితో పెళ్లి అవుతుందో, కాదో తెలియని.. అందుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొంది. చివర్లో సారీ డాడీ.. సారీ మమ్మీ అని రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories Telugu