Skip to main content
Latest News

చెల్లి ప్రవర్తన సరిగా లేదని.. రాత్రి 9.30గంటలకు నడిరోడ్డుపై.. 

సోదరి ప్రవర్తన సరిగా లేదన్న కారణంతో దారుణానికి తెగబడ్డాడో అన్న.. కొందరి సాయంతో ఆమెను పక్కా ప్లాన్‌తో హత్య చేశాడు. ఆపై 12 గంటల్లోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కరీంనగర్‌లో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సిద్ధిపేట జిల్లా కొల్లురి గ్రామానికి చెందిన రామగళ్ల అమల అదే గ్రామానికి చెందిన స్వామితో 2008లో వివాహం అయ్యింది. అమల ఆడబిడ్డనే తన అన్న అనిల్‌ ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆస్తికోసం గొడవలు జరుగుతున్నాయి. అమలకు ఇద్దరు పిల్లలు కాగా ఆమె ప్రవర్తపై అనుమానంతో ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. కాగా తన భార్య తరుపు నుంచి ఆస్తి తనకు రాకుండా తన చెల్లి చేస్తుందనే కక్ష పెంచుకున్న అనిల్‌కుమార్‌ అదును కోసం వేచి చూశాడు. 

తన భర్త నుంచి విడాకులు తీసుకున్న అమల ఇద్దరు పిల్లలతో వచ్చి రేకుర్తిలో హోటల్‌ నిర్వహిస్తోంది. ఆ సమయంలో అనిల్‌ అమెపై దాడి చేయగా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనితో అక్కడ ఉంటే రక్షణలేదని భావించిన అమల రెండునెలల క్రితం రామడుగు మండలం వెదిర గ్రామానికివచ్చి ఇక్కడే బిర్యాని సెంటర్‌ను ఏర్పాటు చేసుకొని జీవిస్తోంది. తన చెల్లి బతికుంటే తనకు ఆస్తి దక్కదని భావించిన అనిల్‌ సిద్ధిపేటకు చెందిన పోతుకంటి ప్రమోద్‌రెడ్డి, శేఖర్‌ అనే ఇద్దరిని వెంట తీసుకువచ్చి అమలను హతమార్చాలని ప్లాన్ చేశాడు. ఆదివారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో ఆమె బిర్యాని సెంటర్‌ను మూసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆమె అన్న రామంచ అనిల్‌కుమార్‌, మరో ఇద్దరితో బైక్‌పైవచ్చి కత్తులతో దాడి చేశారు. మెడపై ఇతర ప్రదేశాల్లో కత్తులతో విచక్షణా రహితంగా డాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృత్యువాతపడింది. ఇది గమనించిన మృతురాలి అక్క అరవడానికి ప్రయత్నించగా ఆమెను కత్తులతో బెదిరించారు. 

అయితే నిందితులు హత్యజరిగిన ప్రదేశానికి 100మీటర్ల లోపే కత్తులను పొదల్లో విసిరేసి బైక్‌ పారిపోయారు. ప్రధాన రహదారిపై వెళ్తే దొరికి పోతామని భయంతో వెలిచాల ప్రాంతంలో రాత్రంతా తలదాచుకున్నారు. సోమవారం ఉదయం వెలిచాల నుంచి వేములవాడ, సిరిసిల్ల మీదుగా సిద్దిపేటకు వెళ్లడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో నిందితుల ఫోన్‌ నంబర్‌ను ట్యాపింగ్‌ చేసిన పోలీసులు వెలిచాల పరసర ప్రాంతంలోనే సంచరిస్తున్నట్లు తెలియడంతో పోలీసులు మూకుమ్మడిగా తరలివెళ్లారు. జిన్నింగ్‌ మిల్‌ ప్రాంతంలో తచ్చాడుతున్న నిందితులు పోలీసుల రాకతో పారిపోవడానికి ప్రయత్నించగా వారిని వలపన్ని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అమల ప్రవర్తన సరిగా లేకపోవడంతో పాటు, తనభార్యను ఇష్టానుసారంగా తిట్టడం, ఆస్తిలో వాటా అడుగుతోందని కోపంతోనే హత్య చేశానని అనిల్‌ నేరం అంగీకరించాడు. గతంలో రేకుర్తిలో ఉండగా ఒకసారి ప్రయత్నించాననీ అప్పుడు విఫలం అయిందని చెప్పుకొచ్చాడు. 

మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.

Crime Stories Telugu