Latest News

ఏపీ లో అక్రమ అరెస్టులు, రౌడీఇజం వుండవు:  నారా లోకేష్

ఆంధ్రాలోనూ వేలు పెడతాం అన్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. నారా లోకేష్ స్పందించారు.  మంగళవారం ఏపీ సచివాలయంలో విలేకరులతో మాట్లాడిన లోకేష్ ఆంధ్రప్రదేశ్‌కు ఎవరైనా రావొచ్చని, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందని, అక్రమ అరెస్టులు, రౌడీయిజం ఉండవని, కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రశాంతంగా ప్రచారం చేసుకోవచ్చన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని అన్నా, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్నా అడ్డుకున్నారా? డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కడతానంటే ఆపేశారా? అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు లోకేష్.  అభివృద్ది చేయడం చేతకాక మాపై విమర్శలా అని లోకేష్ ప్రశ్నించారు.  రేవంత్‌రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమనీ లోకేష్ అన్నారు.  మళ్లీ గెలిపిస్తే రోజూ సెక్రటేరియట్ కు వస్తాననడం కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. తెలంగాణలో ప్రజాకూటమి గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు.