Latest News

నా కంఠం లో ప్రాణం ఉండగా తెలంగాణను బానిస కానివ్వను: కెసిఆర్

తన గొంతులో ప్రాణముండగా తెలంగాణను బానిస కానివ్వనని అన్నారు కెసిఆర్. తెలంగాణలో అధికారం పోయిందన్న కసి కాంగ్రెస్‌ది అయితే, రాష్ట్రం చేజారిపోయిందన్న బాధ చంద్రబాబుదని ఆరోపించారు. తెలంగాణను ఈ ఇనుప మూతి గద్దలకు ఇస్తే ప్రమాదమని, తెలంగాణకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత మేధావులపై ఉందన్నారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని, కోమాలోకి పోతానని డాక్టర్లు చెప్పినా వినలేదని కెసిఆర్ గుర్తు చేసుకున్నారు.  తెలంగాణ వస్తే చీకటిమాయం అవుతుందని శాపనార్థాలు పెట్టారని, చిమ్మచీకటి అవుతుందన్న తెలంగాణను వెలుగులమయం చేశామని కేసీఆర్‌ అన్నారు.  తలసరి విద్యుత్ వినియోగంలో ఇప్పుడు తెలంగాణ నెం.1గా ఉందని ఆయన చెప్పారు.  తాను బతికున్నంత వరకు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు.  ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతోందనీ, అభివృద్ధిలో గుజరాత్‌ మన దరిదాపున కూడా లేదనీ, సంపద పెంచి, పేదలకు పంచాలన్నదే తమ లక్ష్యమని కేసీఆర్‌ స్పష్టం చేశారు.