Skip to main content
Latest News

ఆసుపత్రి మేడ మీదకు భార్యను తీసుకెళ్లి.. ఓ భర్త చేసిన నీచమిది

కూతురికి జ్వరం.. ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స చేయిస్తోందా తల్లి.. ఇంటికి కూడా వెళ్లకుండా.. కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. కానీ భర్తే కాలయముడై ఆసుపత్రికి వస్తాడని ఆమె ఊహించలేకపోయింది. కూతురి పరిస్థితి ఇలా అయిందేంటా..? అని దిగాలుగా కూర్చుని కన్నీరు పెడుతున్న ఆమె వద్దకు భర్త వచ్చాడు.. కూతురు ఎలా ఉందని అడుగుతాడని ఆమె ఆశించింది.. కానీ.. ఊహించని రీతిలో.. తన లైంగిక కోరికలు తీర్చాలని చెప్పడంతో ఆమె ఖంగుతింది. కూతురు అనారోగ్యంతో బాధపడుతోంటే.. ఆసుపత్రిలో ఇదేం పనంటూ ఆగ్రహం వ్యక్తం చేసిందామె.. కానీ అతడు మాత్రం తన పట్టు వదల్లేదు.. భార్యతో గొడవ పడి ఓ సారి బయటకు వెళ్లాడు. కొద్ది సేపటికే మరోసారి ఆసుపత్రికి వచ్చి.. భార్యను మభ్యపెట్టి.. మేడ మీదకు తీసుకెళ్లి.. అదే కోరిక కోరాడు.. నువ్వు మారవంటూ.. ఈసడించుకుని తిరిగొస్తోంటే.. ఆమెపై దాడిచేశాడు.. పైశాచికంగా మారి ప్రాణాలు తీయాలని ఫిక్స్ అయ్యాడు.. బలవంతంగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. ఆమెను చిత్రవధ చేశాడు.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమె పరిస్థితి.. ఇప్పుడు విషమంగా మారింది.. చిత్తూరు జిల్లాలో ఓ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం రేపింది. 

చిత్తూరులోని స్థానిక ఇరువారం దళితవాడకు చెందిన పద్మకు యాదమరి మండలం పాపిశెట్టిపల్లెకు చెందిన నందతో (37)తో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలున్నారు. 16 ఏళ్ల వయసున్న పెద్దమ్మాయికి జ్వరం వచ్చింది. దీంతో మూడు రోజులుగా చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే తల్లి చికిత్స చేయిస్తోంది. అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతో కలిసి పద్మ ఆసుపత్రిలోనే ఉంటోంది. భర్త మాత్రం కూతురి పరిస్థితి ఎలా ఉందని అడిగిన పాపాన పోలేదు.. ఆదివారం రాత్రి నంద ఫుల్లుగా మద్యం తాగి ఆసుపత్రికి వచ్చాడు.. కూతుర్ని చూసేందుకు వచ్చి ఉంటాడని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.. కానీ పద్మ వద్దకు వెళ్లి తన లైంగిక కోరిక తీర్చమని నంద బలవంతం చేశాడు. కుమార్తె అనారోగ్యంతో ఆస్పత్రిలో బాధపడుతుంటే ఈ పాడు పనేంటంటూ.. ఆమె భర్తపై ఆగ్రహించుకుంది.. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ నందను బయటకు పంపించేశాడు. 

మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో నంద ఆసుపత్రికి వచ్చాడు. పద్మను భార్యను మభ్యపెట్టి పిల్లల వార్డు మిద్దెపైకి తీసుకెళ్లాడు. తన కోర్కెను తీర్చాలంటూ బలవంతం చేశాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నంద విచక్షణ కోల్పోయి భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి చీరతో గొంతు నులిమి హత్యాయత్నం చేశాడు. తీవ్ర రక్తస్రావం మధ్య ఒంటిపై దుస్తులు లేకుండా పడి ఉన్న పద్మను సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆమె రెండో కుమార్తె గుర్తించింది. ఆసుపత్రిలో ఉన్న నర్సుకు చెప్పి చికిత్స చేయిస్తోంది. ఈ విషయం గురించి బంధువులకు సమాచారం ఇచ్చింది. పద్మను అత్యవసర విభాగానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినా కోలుకోకపోవడంతో ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉంది. లైంగిక దాడిలో మర్మాంగాలు తీవ్రంగా దెబ్బతినడంతో మరో 24 గంటలు గడిస్తే తప్ప ఆమె ఆరోగ్య పరిస్థితిని ఏమీ చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రిలోనే ఉన్న నందను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఉన్మాదిని తమకు అప్పగించాలనీ.. అతడికి బతికే హక్కు లేదని పద్మ బంధువులు పోలీసుల వాహనానికి అడ్డుతగిలారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారందరినీ తప్పించి.. నందను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నందపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు..