Skip to main content
Latest News

గోమూత్రం తాగితే కేన్సర్ తగ్గిందంట..!

‘నేను రోజూ గోమూత్రం తాగుతా.. అందువల్లే నాకు రొమ్ము కేన్సర్ తగ్గింది.. పూర్తిగా నయం అయింది.  గోమూత్రం వల్ల ఎన్నో వ్యాధులు నయం అవుతున్నాయి.. గోమూత్రంతో తయారు చేసిన ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మంచివి..’.. అంటూ బీజేపీ బోఫాల్ ఎంపీ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా వ్యాఖ్యానించి కలకలం రేపారు. గోమూత్రం రోజూ తాగితే కేన్సర్ నయమయిపోతుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు గురవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సాధ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. గోవుల చుట్టూ నడుస్తోన్న ప్రస్తుత పాలిటిక్స్ గురించి ఆమెను విలేకరులు ప్రశ్నించారు. ఈ అంశంపై స్పందించిన ఆమె.. వింత వ్యాఖ్యలు చేశారు. గో మూత్రాన్ని సేవించడం వల్ల ఎన్నో వ్యాధులు నయం అవుతాయన్నారు. గోవులను దానం చేయడం ఎంతో పుణ్యంతో సమానమన్నారు. ఆవు మూత్రంతోపాటు.. దానితో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు మానవుడికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఆవు మూత్రం తాగినందువల్ల తనకు ఉన్న కేన్సర్ కూడా నయమయిందని ఆమె చెప్పుకొచ్చారు. 
 
‘‘నాకు గతంలో బ్రెస్ట్ కేన్సర్ ఉంది.. డాక్టర్లు ఇచ్చే మెడిసిన్లపై నాకు నమ్మకం లేదు.. అందుకే గోమూత్రంతో పాటు పంచగవ్వ కలిపిన ఆయుర్వేద ఉత్పత్తులను వాడాను.. హిందూ సంప్రదాయం ప్రకారం ఐదు గోవుల మూత్రంతోపాటు ఆవు పేడ, పాలు, పెరుగు, నెయ్యి కలిపి పంచగవ్వ తయారు చేసి వాడాను.. చివరకు అద్భుతం జరిగింది. నా బ్రెస్ట్ కేన్సర్ మటుమాయమయిపోయింది..’ అంటూ సాధ్వీ చెప్పుకొచ్చారు. మరి ఇదెంత నిజమో... డాక్టర్లు.. శాస్త్రవేత్తలే చెప్పాలి.